వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ, ఎన్ని సీట్లో చెప్పాలి: దేవెగౌడ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డి దేవెగౌడ ప్రకటించారు. జెడిఎస్‌ను బిజెపి బీ టీమ్‌గా కాంగ్రెసు అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో కూడా తాము కాంగ్రెసుతో ఎన్నికల పొత్తుకు సిద్ధంగా ఉన్నామని దేవెగౌడ చెప్పారు

Recommended Video

Karnataka Assembly Election 2018 schedule కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

కాంగ్రెసు ఎన్నికల పొత్తుకు ముందుకు వస్తే తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని, తమకు ఎన్ని సీట్లు ఇస్తారో కాంగ్రెసు నేతలు చెప్పాలని, తాము వారికి ఎన్ని సీట్లు ఇస్తామో ఆ తర్వాత చెబుతమమని ఆయన అన్నారు.

ఆ తర్వాత పొత్తు కుదరదు

ఆ తర్వాత పొత్తు కుదరదు

కాంగ్రెసుతో చర్చలకు జరగాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాయావతితో తప్ప ఎన్నికల తర్వాత మరెవరితోనూ పొత్తుకు సిద్ధపడబోమని చెప్పారు.

 జెడిఎస్‌తో మాయావతి బిఎస్పీ

జెడిఎస్‌తో మాయావతి బిఎస్పీ

కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బిఎస్పీ, జెడిఎస్ ఇదివరకే ప్రకటించాయి. ఆ పొత్తు 2019 లోకసభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 8 రిజర్వ్ సీట్లలో, 12 జనరల్ అసెంబ్లీ సీట్లలో బిఎస్పీ పోటీ చేస్తుంది. మిగతా 204 సీట్లకు జెడిఎస్ పోటీ చేస్తుంది.

ఎస్పీకీ సీట్లిస్తాం

ఎస్పీకీ సీట్లిస్తాం

సమాజ్‌వాదీ పార్టీ ఓ సీటు అడుగుతోందని, జెడిఎస్ కొన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని దేవెగౌడ మంగళవారంనాడు చెప్పారు. కాంగ్రెసు పొత్తుకు ముందుకు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు.

అప్పుడు మేం కాంగ్రెసుకు బీ టీమ్

అప్పుడు మేం కాంగ్రెసుకు బీ టీమ్

ధరమ్ సింగ్ ముఖ్యమంత్రిగా, సిద్ధరామయ్య డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు తాము కాగ్రెసుకు బీ టీమ్‌గా ఉన్నామని అన్నారు. కాంగ్రెసుకు తమ పార్టీకి బీ టీమ్‌గా మారుతుందా, తమ పార్టీ కాంగ్రెసుకు బీ టీమ్‌గా మారుతుందా అనేది చూద్దమని అన్నారు.

జెడిఎస్‌పై రాహుల్ గాంధీ ఇలా...

జెడిఎస్‌పై రాహుల్ గాంధీ ఇలా...

జెడిఎస్ బిజెపికి తెర వెనుక మద్దతు ఇస్తోందని, కర్ణాటక ప్రజలకు అది తెలియకూడదని, వారికి అర్థం కాకూడదని అనుకుంటున్నారని కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కూటములు ఎలా ఉన్నా కాంగ్రెసు కర్ణాటకలో గెలుస్తుందని అన్నారు.

English summary
JDS chief HD Deve Gowda has said that they are ready for a pre-poll alliance with the Congress in Karnataka elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X