వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ కమల: మాజీ షీఎం మీద ఏసీబీకి ఫిర్యాదు, కర్ణాటక రాజకీయాలు రసవత్తరం, కేసు నమోదు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోనిస్తూ అవినీతి నిరోధక దళం పోలీసు (ఏసీబీ) అధికారులకు జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఫిర్యాదు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మీద జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీకి మద్దతు ఇస్తే రూ. 10 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప హామీ ఇచ్చారని జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఏసీబీ అధికారులకు షిర్యాదు చేశారు.

కర్ణాటకలోని గురుమిఠ్కల్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో మాజీ ముఖ్మమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడరని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆడియో టేపులు రిలీజ్ చేశారు. సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపులు దాదాపు 40 నిమిషాలు ఉన్నాయి.

JDS worker filed a complaint to ACB against BJP State President, former CM BS. Yeddyurappa

జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ తన పదవికి రాజీనామా చేస్తే రూ. 10 కోట్లతో పాటు మంత్రి పదవి ఇస్తానని బీఎస్. యడ్యూరప్ప ఒత్తిడి చేశారని, సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపులు పరిశీలించి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కఠిన చర్యలు తీసుకోవాలని జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తన కుమారుడు విజయేంద్ర లాగే నీవు తన కుమారుడు లాంటివాడివని బీఎస్. యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ మీద ఒత్తిడి చేశారని, ఆ సమయంలో రికార్డు చేసిన ఆడియో టేపులు శరణ్ గౌడ తనకు పంపించి ఫోన్ చేసి అసలు విషయం బయటకు చెప్పడంతో ఈ ఆడియో టేపులు మీడియాకు విడుదల చేశానని సీఎం కుమారస్వామి చెప్పారు.

English summary
JDS worker filed a complaint to Anty Corruption Beauro (ACB) against BJP State President, Former Chief Minister BS Yeddyurappa on attempt of Operation Kamala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X