వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ABP-C Voter Opinion Poll:మరోసారి నితీశ్ పాగా.. కూటమికి మెజార్టీ సీట్లు..ఏబీపీ సర్వే

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో తిరిగి జేడీయూ-బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని ఏబీపీ సీ ఓటర్ ఓపినీయన్ పోల్ అంచనా వేసింది. నితీశ్ కుమార్ నాలుగోసారి సీఎం పదవీ చేపట్టబోతున్నారని లెక్కగట్టింది. బీహర్ ఓటర్లు మరోసారి నితీశ్ కుమార్‌కు పట్టం కట్టబోతున్నారని తెలిపింది. జేడీయూ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ వస్తోందని తెలిపింది.

Recommended Video

Bihar Polls 2020 : మరోసారి Nitish Kumar కు పట్టం కట్టబోతున్న బీహర్ ప్రజలు.. ABP సర్వే వెల్లడి!

ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..

బీహర్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 122 మెజార్టీ మార్క్ దాటాలి.. అయితే ఏబీపీ సర్వే ప్రకారం నితీశ్ కూటమికి 135 నుంచి 159 సీట్లు వస్తాయని లెక్కగడుతోంది. విపక్ష ఆర్జేడీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందని చెప్పింది. ఈ కూటమికి 77 నుంచి 98 సీట్ల వరకు వస్తాయని తెలిపింది. ఇక ఎల్జేపీ ప్రభావం చూపదని.. 1 నుంచి 5 సీట్లు మాత్రమే గెలచుబోతుందని అంచనా వేసింది. ఇతరులు కూడా 4 నుంచి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటారని.. జేడీయూకు పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో ఇండిపెండెంట్ల ప్రభావం ఉండబోదని తెలిపింది.

JDU-BJP Set To Rule Bihar Again; To Win 135-159 Seats..

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్‌తో బీహరీలు సొంత రాష్ట్రానికి వచ్చారు. ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ముజఫర్ నగర్ షెల్టర్ హోం కేసు.. తదితర అంశాలు నితీశ్ ప్రభుత్వాన్ని ఇరుకన పెడతాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ.. ఏబీపీ సర్వే చెప్పింది. అయితే ఇదీ నిజమవుతుందే తలకిందులు అవుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

బీహర్‌లో మూడు విడతల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత ఎన్నిక 28వ తేదీన జరగబోతుంది. మరో రెండు విడతల పోలింగ్ తర్వాత.. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. వయోజనులను ఆకట్టుకొనేందుకు పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తున్నారు.

English summary
ABP New-Cvoter Opinion Poll gives a clear majority to Nitish Kumar-led NDA in Bihar Elections with BJP-JDU bagging somewhere around 135-159 out of 243 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X