బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ఏటీఎంలో నో క్యాష్: అంత్యక్రియలు, పిండప్రధానం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 రద్దు చేసిన తరువాత ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నగదు తీసుకోవడానికి గంటలు గంటలు క్యూలో నిలబడి ఎంత విసిగిపోతున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

మనలో కూడా చాల మంది ఇలా గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడిన సందర్బాలు ఉన్నాయి. చివరికి దగ్గరకు వెళ్లిన సమయానికి అక్కడ డబ్బులు లేవని తెలిస్తే ఒళ్లు మండిపోతుంది.

బెంగళూరు నగరంలోని ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎం దగ్గర ఇలాంటి సీన్ ఎదురైయ్యింది. అంతే స్థానిక జేడీ (యూ) నాయకులకు మండిపోయింది. ఏటీఎం కేంద్రంలో ఉన్న ఏటీఎం మిషన్ ను రోడ్డు మీదకు తీసుకు వచ్చారు.

డబ్బులు లేని ఏటీఎం చచ్చిన శవంతో సమానం అంటూ అప్పటికప్పుడు పురోహితులతో ఏటీఎం యంత్రానికి అంత్యక్రియలు చేసేశారు. పనిలో పనిగా అప్పుడే అక్కడే పిండప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏటీఎం మిషన్ రోడ్డు మీదకు తీసుకు వచ్చినా స్థానిక పోలీసులు మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

English summary
If you do not have access to Netbanking, funds can be transferred from your bank account to that of another bank using an ATM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X