వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డు.. అదే కోవలో మన అంబానీ కూడా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ఆరేళ్లలో మరో రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఫోర్బ్స్ అత్యంత ధనికుల జాబితా ప్రకారం 143 బిలియన్ డాలర్ల మేరా ఆస్తులు కలిగి ఉన్న ఈ అపర కుబేరుడు బెజోస్.. 2026 నాటికి తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు. ప్రస్తుతం 56 ఏళ్లున్న బెజోస్.. తనకు 62 ఏళ్లు వచ్చేనాటికి ట్రిలియనీర్‌గా అవతరిస్తారని కంపారిజన్ అనే ఓ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే ఆసియా దేశాల్లో అపరకుబేరుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 నాటికి ట్రిలయనీర్‌గా మారుతారని ఆ నివేదిక జోస్యం చెప్పింది.

న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అయిన సంస్థలను ఫోర్బ్స్ ప్రకటించి ప్రపంచ కుబేరుల ఆస్తులను పోల్చి విశ్లేషణ చేసింది కంపారిజన్ సంస్థ. ఇక ఈ సంస్థ వెల్లడించిన నివేదకి ప్రకారం చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం క్సు జియాన్ రెండో ట్రిలియనీర్‌గా అవతరించనున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో హోమ్ డెలివరీలకు డిమాండ్ పెరగడంతో ఆ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఈ క్రమంలోనే అమెజాన్ సంస్థ రానున్న రోజుల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తోంది. జనవరి -మార్చి త్రైమాసికానికి అమెజాన్ సంస్థ 75 బిలియన్ డాలర్లు విలువ చేసే సేల్స్‌ను నమోదు చేసిందని పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి అమెజాన్ సేల్స్ 60 బిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి.

Jeff Bezos and Mukesh Ambani to turn into trillionaire by 2026 and 2033 respectively

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కూడా ఉంటుంది కాబట్టి హోమ్ డెలివరీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని కంపారిజన్ సంస్థ అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రీటెయిలర్ అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ ఆస్తులు గత ఐదేళ్లలో 34శాతంకు పెరిగి ప్రస్తుతం 143 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచినట్లు కంపారిజన్ తెలిపింది. ఇదిలా ఉంటే ట్రిలియనీర్ పై ట్విటర్‌లో స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చాయి. చాలామంది జెఫ్ బెజోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయాన్ని జెఫ్ బెజోస్ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు నెటిజెన్లు. చాలామంది కోవిడ్ మహమ్మారితో ఉద్యోగాలు, జీవితాలు ప్రాణాలు కోల్పోతుంటే జెఫ్ మాత్రం తన ఆస్తులను పెంచుకునే పనిలో పడ్డారంటూ ట్వీట్ చేశారు.

English summary
Jeff Bezos and Mukesh Ambani to turn into Trillionaires by 2026 and 2033 respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X