వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 8లోగా హర్యాణ దేవాలయలతో పాటు రైల్వేస్టేషన్ పేల్చుతాం : జైష్-ఇ-మొహమ్మద్

|
Google Oneindia TeluguNews

హర్యాణలోని అనేక దేవాలయలతో పాటు రివారి రైల్వే స్టేషన్‌ను పేల్చి వేస్తామని జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం ఓ లేఖను కూడ విడుదల చేసింది.ఈ దాడులను అక్టోబర్ 8లోగా చేస్తామని బెదిరించారు. కాగా ఈ లేఖను జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసుద్ అజర్ నుండి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. లేఖ పాకిస్తాన్‌లోని కరాచీ నుండి వచ్చినట్టు పేర్కోన్నారు.బెదిరింపుల నేపథ్యంలో రేవారి రైల్వే స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

JeM has threatened to blow up Rewari railway junction in Haryana by October 8,

భారత్ పై దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులకు శిక్షణ పోందిన ఉగ్రవాదులను నియంత్రణ రేఖవేంట పంపేందుకు పలు ప్రయత్నాలు చేసింది. దీంతో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు పలుమార్లు కాల్పులు జరిపిన భారత సైన్యం కొంతమంది సైనికుల తోపాటు ఉగ్రవాదులను కూడ మట్టుబెట్టింది.అయితే గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ నుండి జరుగుతున్న చొరబాట్ల నేపథ్యంలోనే పలువురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటరనే సమాచారాన్ని కూడ భారత ఇంటలీజెన్స్ అధికారులు సేకరించారు.

ఈ నేపథ్యంలోనే రబ్బరు బోట్ల సహాయంతో సముద్రంలో మొహరించిన భారత భద్రతా దళాలపై కూడ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రత్యేక శిక్షణ పోందారనే సమాచారం సెక్యూరిటి వర్గాలు వెల్లడించాయి.ఇలా శిక్షణ పోందిన వారిలో కనీసం 50 మంది ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలు చెప్పాయి. అయితే భారత్ ఆర్మి మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో భారత్‌తో యుద్దం వస్తుందని పాకిస్తాన్ రైల్వే మంత్రి వ్యాఖ్యలు చేయడంతో తాజాగా ఉగ్రవాదులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది.

English summary
jaish-e-Mohammed (JeM) has threatened to blow up Rewari railway junction in Haryana by October 8, along with many temples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X