చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాం జెత్మలానికే రూ.7 కోట్లు టోకరా పెట్టిన రియాల్టర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Jethmalani
చెన్నై: ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ మోసపోయారట. చెన్నైకి చెందిన ఓ రియాల్టర్ ఆయనకు ఏడు కోట్ల రూపాయలు టోకరా వేశారట. దీనిపై రామ్ జెత్మలాని స్వయంగా తమిళనాడు రాజధాని చెన్నైకి వచ్చి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

జెత్మలానీ శుక్రవారం సాయంత్రం చెన్నైకు చేరుకొని నేరుగా పోలీసు కమిషనరేట్‌కు వెళ్లారు. ఆయన వెంటన ఓ మహిళ ఉన్నారు. స్థానిక చూళ్లైమేడుకు చెందిన ఓ రిలాల్టర్ ఈసిఆఱ్ రోడ్డులో 7 కోట్ల రూపాయలకు స్థలాన్ని ఇస్తానని నమ్మబలికి జెత్మలానీని మోసం చేశారట.

సదరురియాల్టర్ పైన ఫిర్యాదు చేసేందుకే ఆయన చెన్నై వచ్చారంటున్నారు. అయితే పోలీసు స్టేషన్‌ల నిర్మాణాల పునరుద్ధరణ కమిటీలో తాను సభ్యుడినని, దీనికి సంబంధించిన పని మీద కమిషనరేట్‌కు వచ్చానని రామ్ జెత్మలానీ చెప్పారు.

జెత్మలానీ, మరో ఇద్దరు స్నేహితులు చెన్నై ప్రధాన ప్రాంతాల్లోని భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని ఓ మధ్యవర్తిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. అతను వారిని నమ్మించి నగరం మధ్యలో మంచి స్థలం ఉందని చెప్పాడు. స్థలం యజమాని తన మాటలు విశ్వసించడం లేదని అతనికి నమ్మకం కలిగించాలంటే ఏడుకోట్ల రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పి అతను డబ్బు తీసుకున్నాడట.

English summary

 senior Supreme Court lawyer Ram Jethmalani has complained to the Chennai city police that a real estate dealer has cheated him of Rs 7 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X