చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్‌బిఐ నెత్తిన మరో బాంబు: నిండా ముంచిన కనిష్క్, మరో భారీ స్కామ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న సంస్థల బాగోతాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నీరవ్ మోడీ కుంభకోణంతో దేశంలో సర్వత్రా చర్చ జరుగుతున్నవేళ.. వరుసగా కుంభకోణాలు బయటపడుతుండటం ఆందోళన రేకెత్తించే అంశం.

వెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్తవెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్త

ప్రముఖ జ్యువెలరీ సంస్థ కనిష్క్ కూడా తాజాగా కుంభకోణాల జాబితాలో చేరింది. ఈ సంస్థ బ్రాంచిలు చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.824కోట్ల దాకా రుణాలు పొందిన ఆ సంస్థ.. తిరిగి వాటిని చెల్లించలేదు. కుంభకోణం వెలుగుచూడటంతో.. రాత్రికే రాత్రి దుకాణాలు మూసివేసి.. రికార్డులను మాయం చేసేసింది.

 Jewellery chain Kanishk Gold defrauds 14 banks to tune of Rs 824.15 crore

వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ సీబీఐని ఆశ్రయించింది. నిందితులు మారిషస్ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

మరో గోల్‍‌మాల్.. వెలుగులోకి భారీ కుంభకోణం: యాక్సిస్ బ్యాంకుకి 4వేల కోట్ల కుచ్చుటోపీమరో గోల్‍‌మాల్.. వెలుగులోకి భారీ కుంభకోణం: యాక్సిస్ బ్యాంకుకి 4వేల కోట్ల కుచ్చుటోపీ

కాగా, రూ. 824 కోట్ల రూపాయల రుణాల ఎగవేతకు సంబంధించి కనిష్క్‌ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్‌ కుమార్‌ జైన్‌, అతని భార్య నీతా జైన్‌పై ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి కోట్ల పైచిలుకు రుణాలను కనిష్క్‌ గోల్డ్‌ జ్యువెలరీ పొందినట్టు తెలుస్తోంది.

గతేడాది నవంబర్ నెలలోనే కనిష్క్ గోల్డ్ సంస్థను రుణ ఎగవేత జాబితాలో చేర్చాయి బ్యాంకులు. అంతకుముందు సెప్టెంబర్ నెలలో కనిష్క్‌ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్‌ కుమార్‌ జైన్‌ రూ. 20 కోట్ల ఎక్సైజ్ టాక్స్ మోసం కేసులో అరెస్టు అయ్యాడు. ఆ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన భూపేష్.. అప్పటినుంచి భార్యతో సహా పరారీలోనే ఉన్నాడు.

English summary
In yet another bank fraud + , State Bank of India has requested the help of the CBI in January to investigate jewellery chain Kanishk Gold Pvt Ltd for loan fraud to the tune of Rs 842.15 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X