వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చిన్న ఘటనలు మినహా తొలిదశ పోలింగ్ ప్రశాంతం

|
Google Oneindia TeluguNews

రెండు నెలల తర్వాత మరో రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరిగింది. మొత్తం 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. బరిలో అన్ని పార్టీలకు సంబంధించి 189 మంది ఉన్నారు. ఇందులో 15 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.

చత్ర, గుమ్లా, బిష్ణుపూర్, లోహర్దగా, మానికా, లాతెహార్, పంకి, దల్తోగంజ్, బిశ్రమ్‌పూర్, ఛత్తర్‌పూర్, హుసేనాబాద్, గర్హ, భవంత్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తంగా 3,906 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో 989 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ సదుపాయాలను కల్పించింది. ఇక మూరుమూల గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్‌కు సిబ్బందిని హెలికాఫ్టర్లలో చేర్చింది ఎన్నికల సంఘం.మొత్తం 1097 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ... 461 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.

Jharkhand Assembly elections 2019 Live:Polling underway for 13 constituencies

జార్ఖండ్ ఎన్నికలపై మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం:

Newest First Oldest First
4:47 PM, 30 Nov

13 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి 62.87శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
3:52 PM, 30 Nov

13 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3గంటలకు ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
2:44 PM, 30 Nov

శనివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.83శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
2:42 PM, 30 Nov

లోహర్డగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు
1:56 PM, 30 Nov

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా అనుచరుల మధ్య ఘర్షణ జరగడంతో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి తన వద్ద ఉన్న తుపాకీని చూపించారు.
1:37 PM, 30 Nov

ఛత్ర జిల్లాలోని కన్హచ్చట్టి ప్రాంతంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు
12:53 PM, 30 Nov

13 నియోజకవర్గాల్లోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు.
12:06 PM, 30 Nov

చత్ర నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు
11:24 AM, 30 Nov

లోహర్దగా నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
10:49 AM, 30 Nov

ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తడంతో లాతెహార్‌లోని రెండు పోలింగ్ బూతులలో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
10:18 AM, 30 Nov

ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్
10:17 AM, 30 Nov

ఛత్ర నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
10:15 AM, 30 Nov

మానికా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు
10:09 AM, 30 Nov

గుమ్లా జిల్లా బిష్ణుపూర్ నియోజకవర్గంలో బ్రిడ్జిని పేల్చిన మావోలు
10:08 AM, 30 Nov

సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
10:08 AM, 30 Nov

మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
10:04 AM, 30 Nov

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

తొలిదశలో 13 నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్

English summary
Voting in 13 constituencies across six districts in the first phase of Jharkhand assembly election is being held on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X