వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థులే కోటీశ్వరులు.. ఒక్కొక్కరి ఆస్తులు ఎంతంటే..?

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోష్‌తో పాల్గొంటున్నారు. విజయం తమదంటే తమదేనంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక నవంబర్ 30న తొలిదశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మరియు జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజాతంత్రిక్ పార్టీలు 13 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ ఆరుగురు అభ్యర్థులు, జార్ఖండ్ ముక్తి మోర్చా నలుగురు అభ్యర్థులు మరియు ఆర్జేడీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. జేఎంఎం కాంగ్రెస్ మరియు ఆర్జేడీలు పొత్తులో భాగంగా కలిసి పోటీచేస్తున్నాయి.

జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్, సీఎం రఘుబర్ దాస్ ఎక్కడినుంచి అంటే...?జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్, సీఎం రఘుబర్ దాస్ ఎక్కడినుంచి అంటే...?

10 మంది కోటీశ్వరులు

10 మంది కోటీశ్వరులు

ఇక తొలిదశ జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో 10 మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులు ఉండటం విశేషం. దల్‌తన్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠీ అందరికంటే ధనవంతుడు. అతని ఆస్తుల విలువ రూ.53 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక జేవీఎం-పీ పార్టీ అభ్యర్థి రాజ్‌పాల్ సింగ్‌‌ ఆస్తులు అత్యల్పంగా రూ.8.71 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఆయన మానిక నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. జేవీఎం-పీ నుంచి ఏడుగురు అభ్యర్థులు కోటీశ్వరులుండగా.. కాంగ్రెస్ నుంచి ఐదు మంది అభ్యర్థులు కరోర్ పతిలుగా ఉన్నారు.

అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

13 మంది జేవీఎం-పీ అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. పంకి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి శశిభూషణ్ మెహతా పై 11 క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఒక టీచర్ హత్యకు కారణం తానే అన్న ఆరోపణలు ఉన్నాయి. రాంచీలో ఓ పాఠశాలను నిర్వహిస్తున్నారు శశిభూషణ్ మెహతా. చత్ర నుంచి బరిలో దిగుతున్న బీజేపీ అభ్యర్థి జనార్థన్ పాశ్వాన్ మూడు ఆయుధాలు కలిగి ఉండగా అతని భార్య వద్ద ఒక రైఫిల్ ఉంది. మొత్తంగా ఆరుగురు బీజేపీ అభ్యర్థులు ఫైర్ ఆయుధాలు కలిగి ఉన్నారు.

 కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల వయస్సు ఎక్కువే

కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల వయస్సు ఎక్కువే


ఇక ఇతర పార్టీల అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ బీజేపీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వయస్సు ఎక్కువగా ఉంది. జేవీఎం-పీ అభ్యర్థుల వయసు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల వయస్సు 29 నుంచి 72 ఏళ్లుండగా , బీజేపీ అభ్యర్థుల వయస్సు 30 నుంచి 78 ఏళ్లు ఉన్నాయి. వియాశ్రమ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ దూబే వయస్సు అత్యధికంగా 78 ఏళ్లు ఉన్నాయి.

మొత్తానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు నవంబర్ 20 నుంచి జార్ఖండ్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా ఆ రాష్ట్రం రాజకీయంగా వేడెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుమ్లా లో ఓ సభలో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. అయితే ఇంకా తేదీని బీజేపీ ప్రకటించాల్సి ఉంది.

English summary
In the first phase of Assembly polls in Jharkhand scheduled to take place on November 30, the highest number of 'crorepati' candidates belong to the ruling BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X