వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే గారు ఒక్కసారి జై శ్రీరాం అనండి... మంత్రి వివాద స్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో బీజీపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జై శ్రీ రాం నినాదం ఊపందుకుంది. దీంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ నినాదంతో అటు పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో రాజకీయా విమర్శలకు సైతం కారణమవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఈ నినాదంతో రాజకీయ యుద్దం నెలకోన్న నేపథ్యంలోనే ఏకంగా ఈ నినాదం మంత్రులకు సైతం తాకింది.

మీరు బాబరు వారసులు కాదు, రాముడి వారసులు

మీరు బాబరు వారసులు కాదు, రాముడి వారసులు

ఈ నేపథ్యంలోనే జైశ్రీరాం నినాదాలు కార్యకర్తల నుండి మంత్రులకు కూడ పాకింది. తాజాగా జార్ఖండ్ మంత్రి ఇలాంటీ అరోపణలు ఎదుర్కోంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సీపీ సింగ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారీటి ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీని జై శ్రీరాం అనాలంటూ చెప్పాడు. ఇర్ఫాన్ జీ జై శ్రీరాం అని గట్టిగా అనండి, మీ పూర్వికులు రాముడి వంశానికి చెందిన వారు కాని బాబర్ వంశానికి చెందిన వారు కాదు అంటూ అడిగాడు.

ఉద్యోగాలు మౌలిక వసతులు కల్పించండి..

ఉద్యోగాలు మౌలిక వసతులు కల్పించండి..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సైతం మంత్రి వ్యాఖ్యలపై స్పందించాడు. ముందు గ్రామాల్లో మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించండి, అని హితవు పలకడంతో పాటు రాముడి పేరును బద్నాం చేయకండి అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి.

శ్రీరాం నినాదంపై ప్రధానికి లేఖ రాసిన ప్రముఖులు

శ్రీరాం నినాదంపై ప్రధానికి లేఖ రాసిన ప్రముఖులు

కాగా రెండు రోజుల కేరళకు చెందిన ప్రముఖ రచయిత అదూర్ గోపాల క్రిష్ణన్ తోపాటు 49మంది సెలబ్రెటిలు జై శ్రీరాం నినాదంపై ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే... ఈ నినాదం మూకుమ్మడి దాడులకు పురికొల్పుతుందని దీంతో లా అండ్ అర్డర్ సమస్య కూడ ఉత్పన్నమవుతుందని లేఖలో పేర్కోన్నారు. మరోవైపు మతాల మధ్య హింస చెలరేగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులను ఆపాలని ప్రధానిని కోరారు.

English summary
At a time when the Bharatiya Janata Party (BJP) has been facing flak from various quarters for allegedly politicising the religious slogan ‘Jai Shri Ram’, a video of a BJP minister has surfaced on media in which he can be seen asking a Congress MLA to chant the slogan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X