ఇదీ దెబ్బంటే: సీఎం రేపే చేశాడు ?, బీజేపీ ఎంపీపై రూ. 100 కోట్లకు సీఎం దావా, ట్విట్టర్, ఫేస్ బుక్ !
ముంబై/ న్యూఢిల్లీ/ రాంచీ: కరోనా (COVID 19) కాలంలో రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్న సీఎం రేప్ కేసు ఆరోపణల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సీఎం ఓ మహిళ మీద రేప్ చేశారని బీజేపీ ఎంపీ ఆరోపణలు చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేసి నా పరువు తీస్తావా ? అంటూ బీజేపీ ఎంపీ మీద సీఎం కోర్టులో ఏకంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. పనిలో పనిగా తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఆ సీఎం ట్విట్టర్, ఫేస్ బుక్ అధికారులు నోటీసులు పంపించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

దూమరం రేపిన బీజేపీ ఎంపీ దూబే
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 2013లో ముంబాయిలో ఓ హమిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ట్విట్టర్ లో పోస్టు చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మహిళపై అత్యాచారం చేసి ఇప్పుడు పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ఆరోపించడంతో కలకలం రేపింది.

సీఎంపై రేప్ ఆరోపణలా ?
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ మీద అత్యాచారం ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దూమరం రేపింది. కరోనా కాలంలో సీఎం హేమంత్ సోరెన్ వివాదం హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ వర్గాల్లోనే కాకుండా జార్ఖండ్ ప్రజలు ఇదే విషయంపై నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు.

జులై 27వ తేదీ ఏం జరిగిందంటే ?
జులై 27వ తేదీన బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముంబాయి మహిళ మీద అత్యాచారం చేశారని ట్విట్టర్ లో ఆరోపణలు చెయ్యడం వివాదానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం మండిపడ్డారు. అయితే సీఎం హేమంత్ సోరెన్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలును ట్విట్టర్, ఫేస్ బుక్ ఉద్యోగులు తొలగించలేదని స్వయంగా సీఎం హేమంత్ సోరెన్ ఆరోపిస్తున్నారు.

సీఎం సీరియస్, రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా
బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తన మీద తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువు తీస్తున్నారని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాంచీ సివిల్ కోర్టులో ఆగస్టు 4వ తేదీన రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన మీద చేసిన ఆరోపణల వాస్తవాలు పరిశీలించకుండా వాటిని యథాతంగా ప్రచురించారని, ఆ పోస్టులు తొలగించకుండా చోద్యం చూశారని ఆరోపిస్తూ ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ల ప్రతినిధులను ఏ 2, ఏ 3గా పేర్కోంటూ సీఎం హేమంత్ సోరెన్ కోర్టును ఆశ్రయించారు.

సీఎంకు బీజేపీ ఎంపీ చాలెంజ్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రూ. 100 కోట్లకు కోర్టులో పరువు నష్టం దావా వేసినా బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే మాత్రం ఒక్క అడుగుకూడా వెనక్కి తగ్గడం లేదు. నా మీద పరువు నష్టం దావా వెయ్యడం కాదు సీఎం గారు, మీరు ముందు మీ మీద రేప్ కేసు పెట్టిన ముంబాయి మహిళ మీద కేసు పెట్టండి, ఆమెను రేప్ చెయ్యలేదని కోర్టులో న్యాయపోరాటం చెయ్యండి అంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే సీఎం కు సవాలు విసిరారు.

భలే చాన్స్ చిక్కింది
ఏమైనా ఒక సీఎం మీద న్యాయపోరాటం చెయ్యడానికి స్వయంగా ఆ సీఎం తనకు అవకాశం ఇచ్చారని, భలే చాన్స్ చిక్కిందని బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే అంటున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఆగస్టు 5వ తేదీన వాదనలు జరిగాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరువు నష్టం దావా కేసు ఆగస్టు 22వ తేదీకి వాయిదా పడింది.