వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ ఫలితాలు 2019:పాక్ గురించి కాదు.. ఇండియా గురించి ఆలోచించండి..కపిల్

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సమాయాత్తమైంది. రెండు జాతీయ పార్టీల్లో ఉత్కంఠతను రేపుతోంది. మొన్నటిదాకా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ-లోక్ జనశక్తి పార్టీ-ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కు చేదు అనుభవం తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ సారి జార్ఖండ్ లో కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తిమోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

24 జిల్లాల కేంద్రాల్లో కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. చందన్ క్యారీ, టోర్పా నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ముందుగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. 28 రౌండ్ల వరకూ కొనసాగబోయే ఛత్రా నియోజకవర్గం ఫలితం చిట్టచివరిగా వెలువడుతుందని అంటున్నారు. కౌంటింగ్ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు, రౌండ్ టు రౌండ్ అప్ డేట్స్ మీ కోసం..

Jharkhand Election Results 2019: Counting For 81 assembly Seats live

Newest First Oldest First
10:13 AM, 18 Jan

20వ తేదీలోపు విస్తరణ

20వ తేదీ లోపు జార్ఖండ్ క్యాబినెట్‌ను విస్తరించేందుకు సోరెన్ ప్రయత్నాలు
10:11 AM, 18 Jan

క్యాబినెట్ విస్తరణ..కాంగ్రెస్ నేతలతో సోరెన్ భేటీ

త్వరలో విస్తరించనున్న క్యాబినెట్ కోసం కాంగ్రెస్ నేతలతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ భేటి
7:24 PM, 17 Jan

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు 2019: జార్ఖండ్‌లో అధికారానికి జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి

8:48 AM, 24 Dec

జార్ఖండ్ యంగెస్ట్ సీఎం హేమంత్ సోరెన్ అవుతున్నారు.
8:47 AM, 24 Dec

జార్ఖండ్‌లో ఏ ముఖ్యమంత్రి కూడా రెండోసారి వరుసగా గెలవలేదు. ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయింది.
8:46 AM, 24 Dec

కాంగ్రెస్ - జేఎంఎం మిత్రపక్షం మెజార్టీ సీట్లు దక్కించుకుంది. దీంతో వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
8:45 AM, 24 Dec

జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎంకు 30 సీట్లు, బీజేపీకి 25 సీట్లు, కాంగ్రెస్‌కు 16 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వచ్చాయి.
8:43 AM, 24 Dec

జార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి, ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఆర్జేడీని కూడా కేబినెట్లోకి తీసుకోవచ్చు.
8:13 AM, 24 Dec

జార్ఖండ్‌లో హిందువులను, ముస్లింలను విడదీయాలని అమిత్ షా ప్రయత్నించాడు. కానీ ప్రజలు బీజేపీని తిరస్కరించారు.. సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన
7:53 AM, 24 Dec

నిన్న మహారాష్ట్రలో బీజేపీకి ఓటమి, నేడు జార్ఖండ్‌లో.. రేపు ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే కమలం పార్టీకి ఎదురవుతుంది.. శివసేన
7:33 AM, 24 Dec

పాక్ గురించి కాదు.. ఇండియా గురించి ఆలోచించండి

పాకిస్థాన్ గురించి తక్కువ ఆలోచించండి.. భారత్ అభివృద్ది పథంలోకి నడిపించే దిశగా ఎక్కువ ఆలోచన చేయండి.. కపిల్ సిబాల్
7:06 AM, 24 Dec

జార్ఖండ్ ఎన్నికల తుది ఫలితాలు..

జార్ఖండ్ ఎన్నికల తుది ఫలితాలు..
జార్ఖండ్ ఎన్నికల తుది ఫలితాలు.. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 సీట్లు, బీజేపీ 25, ఇతరులు 9
6:47 AM, 24 Dec

జార్ఖండ్ విజయం ప్రత్యేకం, అత్యంత ప్రాధాన్యమైనది

జార్ఖండ్ విజయం సమకాలీన పరిస్థితుల్లో ప్రత్యేకం, అత్యంత ప్రాధాన్యమైనది. దేశాన్ని విభజించాలనే ప్లాన్‌తో వెళ్తున్న బీజేపీని ఓడించినందుకు జార్ఖండ్ ప్రజలకు అభినందనలు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
6:43 AM, 24 Dec

ప్రకటించిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు:

ప్రకటించిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు 81/81: జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలుపు
12:23 AM, 24 Dec

ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేదంటే..

జార్ఖండ్‌లో ఉద్దేశపూర్వకంగానే ఈవీఎంలను హ్యాక్ చేయలేదు. ఎందకంటే ఢిల్లీలో ఒకవేళ చేస్తే ఎలాంటి అనుమానం రాకుండా ఉండటానికే అని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.
12:16 AM, 24 Dec

పార్టీ నేతలకు, మిత్ర పక్షాలకు అభినందనలు

జార్ఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ నేతలకు, మా మిత్రపక్షాలు, భాగస్వామ్య పార్టీలకు అభినందనలు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
11:52 PM, 23 Dec

రెండు చోట్ల హేమంత్ సోరెన్ విజయం

రెండు చోట్ల హేమంత్ సోరెన్ విజయం
జేఎంఎం నేత, సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 13188 ఓట్ల తేడాతో విజయం.. అలాగే బర్హెయిట్ నియోజకవర్గంలో 25740 ఓట్లతో గెలుపు
11:42 PM, 23 Dec

ప్రజల ఆకాంక్షల మేరకు జార్ఖండ్‌లో పాలన అందిస్తాం: కాంగ్రెస్ కమిటీ ఇంచార్జీ ఆర్పీఎన్ సింగ్ జార్ఖండ్‌లో స్థానిక కుమ్ములాటల వల్లే బీజేపీ ఓడిపోయింది: బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు
11:35 PM, 23 Dec

కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ 45, బీజేపీ కూటమి 22 స్థానాల్లో విజయం
11:00 PM, 23 Dec

స్థానిక సమస్యల వల్లే

స్థానిక సమస్యల వల్లే జార్ఖండ్‌లో ఓటమి పాలయ్యాం.. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు
10:50 PM, 23 Dec

జార్ఖండ్ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నా, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజల కలలను నేరవేరుస్తుందని ఆశిస్తున్నా: ఆపదర్మ సీఎం రఘుబర్ దాస్
10:40 PM, 23 Dec

39 చోట్ల కాంగ్రెస్ కూటమి, 18 చోట్ల బీజేపీ కూటమి విజయం
10:30 PM, 23 Dec

జార్ఖండ్‌లో ప్రభావం చూపని బీజేపీ: అరవింద్ కేజ్రీవాల్
10:22 PM, 23 Dec

జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌కు అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు
10:12 PM, 23 Dec

కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాభీష్టానికి వ్యతిరేకం
10:03 PM, 23 Dec

సీఏఏ, ఎన్ఆర్సీ వల్లే జార్ఖండ్‌లో బీజేపీ ఓటమి: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
9:56 PM, 23 Dec

సేవ చేసే అవకాశం కల్పించినందుకు

అనేక సంవత్సరాలు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. పార్టీ ఎంతో సేవ చేసిన కార్యకర్తలకు నా అభినందనలు. ఎప్పటికప్పుడు ప్రజా సంబంధింత సమస్యలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
9:26 PM, 23 Dec

మొత్తం 81 సీట్ల ఫలితాలు వెల్లడి..

కాంగ్రెస్, జేఎంఎం 47, బీజేపీ 25, జేవీఎంపీ 3, ఏజేఎస్‌యూ 3, ఇతరులు 4 సీట్లలో గెలుపు
9:26 PM, 23 Dec

పార్టీల వారీగా గెలిచిన స్థానాలు

30 జేఎంఎం, బీజేపీ 25, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1, ఏజేఎస్‌యూ పార్టీ 2, సీపీఐ (ఎంఎల్ లిబరేషన్) 1, జేవీఎంపీ 3, ఇతరులు 3
8:41 PM, 23 Dec

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: జేఎంఎం 37, బీజేపీ 13, కాంగ్రెస్ 8, ఏజేఎస్‌యూ 2, సీపీఐ 1 స్థానాల్లో విజయం
READ MORE

English summary
The counting of votes for 81 Jharkhand Assembly seats, which went to polls in five phases from November 30 to December 20, will take place on Monday. The counting will start at 8 am in all the 24 district headquarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X