వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ గుండెల్లో జార్ఖండ్ డైనమేట్: హంగ్ దిశగా: కమలానికి మరో ఎదురుదెబ్బ..!

|
Google Oneindia TeluguNews

రాంచీ: భారతీయ జనతా పార్టీ మరో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకోబోతోందా? జార్ఖండ్ లో వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలు కానున్నాయా? చిన్నరాష్ట్రం జార్ఖండ్ లో మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. నిన్నటి దాకా బీజేపీ ఖాతాలో కనిపించిన జార్ఖండ్ లో ఈ సారి హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

IANS-CVoter-ABP exit poll: జార్ఖండ్‌లో హంగ్ అసెంబ్లీనేనా? ఏ పార్టీకి ఎన్నిసీట్లంటే..?IANS-CVoter-ABP exit poll: జార్ఖండ్‌లో హంగ్ అసెంబ్లీనేనా? ఏ పార్టీకి ఎన్నిసీట్లంటే..?

 హంగ్ ఏర్పడటానికే అవకాశాలు..

హంగ్ ఏర్పడటానికే అవకాశాలు..

జార్ఖండ్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికే అధిక అవకాశాలు ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం 45. ఈ మేజిక్ ఫిగర్ ను ఏ పార్టీ కూడా అందుకోకపోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. మహారాష్ట్ర తరహా వాతావరణం ఏర్పడవచ్చని వెల్లడిస్తున్నాయి.

ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ కూటమి

ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ కూటమి

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ కూటమి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీట్లను సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కూటమి 31 నుంచి 39 స్థానాలను కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఐఎఎన్ఎస్-సీఓటర్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

రెండో స్థానంలో బీజేపీ..

రెండో స్థానంలో బీజేపీ..


ఈ ఎన్నికల్లో బీజేపీ రెండోస్థానానికే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, లోక్ జనశక్తి పార్టీలకు ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చని చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 28 నుంచి 36 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఎఎన్ఎస్-సీఓటర్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.

English summary
The C-Voter exit polls has predicted that the JMM-Congress-RJD combine will win 35 seats. The BJP may end up with 32 which would mean that Jharkhand would have a hung assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X