వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.200 కోసం.. మైనర్‌ను తన్ని, ఇనుపరాడ్డును కాల్చి తలపై, ఛాతీలో పెట్టి.. ఉద్యోగి పైశాచికం

|
Google Oneindia TeluguNews

కలికాలం.. అవును కలికాలంలో మంచి లేదు. మానవత్వం అసలే లేదు. అనుమానంతో, చిన్నచూపుతో వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ వద్ద పనిచేస్తున్నారని కూడా దయచూపడం లేదు. జార్ఖండ్‌లో ఓ పనిచేసే బాలికపై యజమాని కర్కశంగా ప్రవర్తించాడు. రూ.200 దొంగిలించేందేమోననే అనుమానంతో టార్చర్ అంటే ఏంటో చూపించాడు. చివరికి విషయం వెలుగులోకి రాకుండా ఉండేందుకు రూ.లక్ష ఇస్తానని చెప్పినా.. కుటుంబసభ్యులు మాత్రం వినిపించుకోలేదు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

మహిళా ఐఎఎస్ కూ తప్పని వేధింపులు: సొంత కార్యాలయంలోనే అసభ్య ప్రవర్తన!మహిళా ఐఎఎస్ కూ తప్పని వేధింపులు: సొంత కార్యాలయంలోనే అసభ్య ప్రవర్తన!

పైశాచికం

పైశాచికం

జార్ఖండ్‌లో హజారీబాగ్‌కు చెందిన రాకేశ్ కుమార్ ఇంటి యాజమాని. ఇతను ప్రభుత్వ ఉద్యోగి కూడా. ఇతని వద్ద ఓ మైనర్ బాలిక పనిచేస్తుంది. వాస్తవంగా ఇంటి వద్ద, కార్యాలయంలో మైనర్లతో పని చేయించడమే తప్పు. అదీ కాకుండా దొంగతనం నెపం పెట్టి చుక్కలు చూయించాడు. 4 నెలల క్రితం పనిచేసి వెళ్లిన బాలిక.. అతనికి కనిపించింది. అయితే చిన్నారి పోతూ పోతూ రూ.200 తీసుకెళ్లిందని రాకేశ్ అనుమానించాడు. అదే బాలికను చిత్రవదకు గురిచేసింది.

తీయలేదని చెప్పినా ..

తీయలేదని చెప్పినా ..

రూ.200 తీశావని అడిగితే పాపం ఆ బాలిక తీయలేదని చెప్పింది. తీసుకోలేదు కాబట్టి అలా చెప్పింది. దీంతో సైకోలా మారిన యాజమాని తన ప్రకోపాన్ని చూపించాడు. ఆమెను తన్ని తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఇనుప రాడ్డును కాల్చి తలపై పెట్టాడు. అక్కడే కాదు చాతీ, మొహంపై పెట్టి శాడిస్ట్ అనిపించుకున్నాడు. దాడి చేసి తన ఇంట్లో ఓ మూలన పడేశారు. 15 రోజుల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గ్రామ పొలిమెరలో పడేసి చేతులు దులుపుకుందామని అనుకొన్నారు. కానీ వారి ఆటలను కుటుంబసభ్యులు సాగనీయలేదు.

ఇలా వెలుగులోకి

ఇలా వెలుగులోకి

ఆ బాలికను చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. వారు ఆమెను తీసుకొని హజారీబాగ్‌లో గల సదర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తర్వాత బాలిక కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించకుండా ఉండేందుకు బేరం ఆడారు. పోలీసు కంప్లైంట్ చేయకుంటే రూ. లక్ష ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ తమ కూతురిపై అనుచితంగా ప్రవర్తించి, డబ్బులు ఇస్తావా అని వారు అందుకు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
minor girl was burnt with a hot iron rod and beaten up allegedly by her employer in Hazaribagh city in Jharkhand on the suspicion of stealing Rs 200.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X