వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ లాలూకు బెయిల్ మంజూరు... కానీ..! అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఆర్జేడీ నేత

|
Google Oneindia TeluguNews

బీహార్ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాస్త ఊరట లభించింది. దాణా స్కామ్‌లో జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఓ కేసులో బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ట్రెజరీ కేసుతో సంబంధం ఉన్న రూ.950 కోట్లు దాణా స్కామ్‌లో లాలూకు బెయిల్ మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు. 1992-92లో లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైబాసా ట్రెజరీ నుంచి రూ.33.67 కోట్లు తీసుకున్నారు. ఈ కేసులో లాలూకు ఊరట లభించినప్పటికీ ఆయన విడుదల కారు. ఎందుకంటే దుమ్కా ట్రెజరీ కేసులో లాలూకు 14 ఏళ్లు జైలు శిక్షను కోర్టు విధించింది.

ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో 1991 నుంచి 1996 మధ్య లాలూ హయాంలో పశుసంవర్ధక శాఖ రూ.3.5 కోట్లు మేరా నిధులు దారి మళ్లించింది. దాణా స్కాంలో ఈ మాజీ కేంద్రమంత్రి మూడు కేసుల్లో దోషిగా తేలారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో టైప్‌-2 డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్‌కు చికిత్స పొందుతున్నారు. లాలూ కిడ్నీ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు గాను ఆరు కేసుల్లో దోషిగా తేలారు. 2017 నుంచి లాలూ ప్రసాద్ జైలులోనే ఉన్నారు. మూడు దాణా స్కాంలలో 3.5 ఏళ్లు, 5 ఏళ్లు 14 ఏళ్లు జైలు శిక్షను కోర్టు విధించింది.

Jharkhand High court grants bail to Lalu Prasad Yadav ahead of Bihar Assembly polls

Recommended Video

#BabaKaDhaba : People Joins Hands To Support Baba Ka Dhaba In Delhi | Oneindia Telugu

ఇదిలా ఉంటే దియోఘడ్ ట్రెజరీ కేసులో 2013లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే 3.5 ఏళ్ల జైలు శిక్షకు గాను సగం శిక్ష పూర్తి చేసుకున్నారు. ఇక తాజాగా బీహార్‌లో ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు గట్టి పోటీనిస్తోంది. అయితే లాలూ ప్రసాద్ యాదవ్‌ దోషిగా తేలినందున ఆయన ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదు. అయితే లాలూ సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారమే కొడుకు తేజస్వీ యాదవ్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

English summary
The Jharkhand High Court on Friday granted bail to former Bihar CM Lalu Prasad Yadav in connection with the Chaibasa treasury case related to the Rs 950 crore fodder scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X