వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఫ్ ఫెస్టివల్‌పై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు టీచర్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ : తన ఫేస్‌బుక్ వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు లేదా పోస్టులు పెట్టినందుకు గాను జమ్షెద్‌పూర్ పోలీసులు ఓ కాలేజ్ లెక్చరర్‌ను అరెస్టు చేశారు. రెండేళ్ల కిత్రం ఈ లెక్చరర్ అనుచిత పోస్టులను పెట్టాడు. అయితే అప్పటి నుంచి పోలీసులు తనకోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు దొరికాడు.

జీత్రాయ్ హన్సద అనే డిగ్రీ కాలేజీ లెక్చరర్ జమ్షెద్‌పూర్ కోఆపరేటివ్ కాలేజ్‌లో పనిచేస్తున్నాడు. జమ్షెద్‌పూర్‌కు దగ్గరలోని సక్చి అనే గ్రామంలో నివాసముంటున్నాడు. అయితే ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టులు చేసినందుకు గాను అతనిపై కేసు నమోదైందని.. రెండేళ్లు క్రితం నుంచి హన్సద తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక హన్సదపై ఐపీసీలోని పలు చట్టాల కింద, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇక తనను త్వరలోనే న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతామని రాజీవ్ సింగ్ అనే పోలీస్ అధికారి తెలిపారు.

Jharkhand lecturer arrested for facebook post on Beef festival held at IIT Madras in 2017

ఐఐటీ మద్రాస్‌లో జరిగిన బీఫ్ పార్టీకి మద్దతుగా కొన్ని పోస్టులు తన ఫేస్‌బుక్‌ వాల్‌పై రాశాడు. ఈ పోస్టులు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విశ్వ పరిషద్ సభ్యులు. వెంటనే హన్సదా పై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2017లో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. కేంద్రం బీఫ్‌పై ఆంక్షలకు నిరసనగా ఈ పండుగను నిర్వహించారు. ఆ సమయంలో హన్సదాపై వేటు వేయాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో కొల్హాన్ యూనివర్శిటీలో పనిచేస్తుండేవారు హన్సద. ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ శుక్ల మొహంతీని హన్సద గురించి ఆరా తీశారు. ఆ సమయంలో ఆయన మహిళల డిగ్రీ కళాశాలలో పనిచేసేవారు. ఆ తర్వత ఆయన్ను గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించడం జరిగిందని వైస్ ఛాన్సెలర్ చెప్పారు. ముందుగా ఫేస్‌బుక్ వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పిన వైస్ ఛాన్సెలర్ ఆ తర్వాత ఆయన్ను గెస్ట్ లెక్చరర్‌గా నియమించామని చెప్పారు. అనంతరం ఆయన ఈ మధ్యే జమ్షెద్ ‌పూర్‌లోని మరో కాలేజీలో జాయిన్ అయినట్లు తెలిసిందని వెల్లడించాడు.

English summary
A government college teacher has been arrested here for allegedly writing an “objectionable post” on Facebook two years ago in support of a beef party in Chennai, police said on Sunday.Jeetrai Hansda, a contractual faculty member in the Jamshedpur Co-operative College, was apprehended from a village in Sakchi area of Jamshedpur on Saturday night, an officer said, adding that the teacher had been evading arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X