వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వం మరిచారు : జార్ఖండ్ ఘటనపై రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కౌంటర్ అటాక్ చేశారు. బీజేపీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన ఘటనను ఉటంకిస్తూ విమర్శలు చేశారు.

అరాచకం ..
ఇటీవల జార్ఖండ్‌లో ఓ యువకుడు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అతనిని పోలీసులు కస్టడీకి తీసుకొని హింసించారు. 4 రోజుల హింస తర్వాత అతను చనిపోయాడు. దీనిని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. జార్ఖండ్‌లో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. మరి ఇలాంటి మానవత్వం లేని ఘటనలేంటని ప్రశ్నించారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమేనా మీ ఉద్దేశం అని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ట్వీట్‌లో కౌంటర్ ఇచ్చారు రాహుల్.

Jharkhand lynching case a blot on humanity: Rahul

రక్షణ ఏదీ ?
ఆ ట్వీట్‌కు రాహుల్ హ్యాష్ ట్యాగ్ ఇండియా అగైనిస్ట్ లించ్ టెర్రర్ అని జోడించారు. టాబ్రిజ్ అన్సారీ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు దాడిచేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ ‌లోరి ఖారస్వాన్ జిల్లాకు చెందన అన్సారీ .. కొందరు జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని దాడి చేశారు. తర్వాత పోలీసులు వచ్చి అన్సారీని తీసుకెళ్లారు. అయితే దెబ్బలకు తాళలేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఎమర్జెన్సీ విధించి నేటికి 45 ఏళ్లవుతుంది. దీంతో పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావిస్తూ విమర్శించగా .. రాహుల్ అందుకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

English summary
the brutal iynching of this young man by a mob in jharkhand is a blot on humanity. the cruelty of the police who held this dying boy in custody for 4 days is shocking as is the silence of power voices in the bjp ruled central and state governments rahul said on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X