తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..
కొత్త ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన క్రైమ్ కథనాలు దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో విద్యాధికులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల్ని క్షుద్రపూజలకు బలిచేసిన ఉదంతం మరువక ముందే, జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్భూమ్ జిల్లాలో ఓ కొడుకు తన తల్లిని అతి దారుణంగా చంపేసి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్న ఉదంతం సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

అన్నం పెట్టలేదనే కోపంతో..
జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్భూమ్ జిల్లా నామ్వీర్ టోలా ప్రాంతానికి చెందిన ప్రధాన్ సోయ్కి 35 ఏళ్లు. చదువుసంధ్యల్లేని ఆ వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ.. తల్లి సుమి సోయ్(60)తో కలిసి జీవనం సాగించేవాడు. చాలా కాలంగా తాడుగుకు బానిసైన ప్రధాన్ తరచూ ఇంట్లో గలాటా సృష్టించేవాడు. కొడుకుతో తాగుడు మాన్పించేందుకు తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి మరోసారి ఫూటుగా మద్యం సేవించి ఇంటికి రాగా, అతనికి అన్నం పెట్టేందుకు తల్లి నిరాకరించింది. ఆ కోపంలో..

తల్లిని చంపి, ఇంటి పెరట్లోనే..
తాగుడు మానేస్తానంటేనే అన్నం పెడతానంటూ తల్లి భీష్మించడంతో అప్పటికే మత్తులో ఉన్న ప్రధాన్.. దుడ్డుకర్రతో ఆమెపై దాడి చేశాడు. విచక్షణారహితంగా కర్రతో బాదడంతో ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికప్పుడే ఇంటి పెరట్లోనే కట్టెలు పోగేసి తల్లిని తగులబెట్టేశాడా కొడుకు. అంతేకాదు, తల్లి చితిపై కోడి మాంసాన్ని కాల్చుకుని తినేసి, అక్కడే నిద్రపోయాడు. తెల్లారేసరికి..

సగం కాలిన శవాన్ని మళ్లీ..
శుక్రవారం రాత్రి ఇంటి పెరట్లోనే తల్లిని తగలేసినా, శవం పూర్తిగా కాలలేదు. ఉదయాన్నే లేచిన ప్రధాన్.. మరోసారి స్టౌ వెలిగించి, దానిపై తల్లిని పూర్తిగా కాల్చేసే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అతని సోదరి ఇంట్లోకి వచ్చి.. అక్కడి దృశ్యాన్ని చూసి షాకైంది. పెద్దగా కేకలు వేస్తూ చుట్టుపక్కలవాళ్లను పిలిచింది. అందరూ కలిసి ప్రధాన్ ను తాళ్లతో కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా..

నాలుగేళ్ల కిందట తండ్రిని చంపి..
స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన్ సోయిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తల్లి(సుమి సోయ్)ని చంపి, చితిపై చికెన్ తిన్న ఈ ఉన్మాది.. నాలుగేళ్ల కిందట తండ్రి(గోపాల్ సోయ్)ని కూడా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. తండ్రిని హత్య చేసిన కేసులో ప్రధాన్ జైలుకు కూడా వెళ్లాడు. మరిప్పుడు అతను ఊళ్లోకి ఎలా వచ్చాడు? ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? బెయిల్ పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్నాడా? అనే వివరాలను రాబడతామని పోలీసులు చెప్పారు.