వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ 2019 లైవ్ అప్‌డేట్స్.. మద్యాహ్నం 3 గంటల వరకు 59.27 పోలింగ్ నమోదు

Jharkhand poll 2019 LIVE News, Jharkhand poll 2019 news, Jharkhand 2019 elections, East Jamshedpur Election news, West Jamshedpur election news, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ 2019 లైవ్ అప్‌డేట్స్, జార్ఖం

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో రెండో విడుత ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నిక బరిలో మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 47,24,968 ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 29 మహిళా అభ్యర్థులు,73 మంది స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో ఉన్నారు.

18 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఈస్ట్ జెంషెడ్‌పూర్, పశ్చిమ జెమ్‌షెడ్‌పూర్ నియోజకవర్గాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Jharkhand poll 2019 LIVE updates

Newest First Oldest First
4:48 PM, 7 Dec

స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగిన జార్ఖండ్ రెండో విడత పోలింగ్
4:47 PM, 7 Dec

కాసేపట్లో ముగియనున్న రెండు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
4:47 PM, 7 Dec

జార్ఖండ్ రెండో విడత పోలింగ్: 20 సీట్లకు గాను 18 చోట్ల పోలింగ్ పూర్తి, 55 శాతం ఓటింగ్ జరిగి ఉంటుందని అధికారుల అంచనా
4:14 PM, 7 Dec

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.27 శాతం పోలింగ్ నమోదు
3:49 PM, 7 Dec

జార్ఖండ్ రెండో విడత పోలింగ్‌లో ఓటేసి చూపుతున్న సీఎం రఘుబర్‌దాస్
2:47 PM, 7 Dec

తూర్పు సింగ్బుంలో విషాదం: పోలింగ్ విధుల్లో ఉండగా గుండెపోటు, పోలీసు అధికారి మృతి
2:31 PM, 7 Dec

మాజ్‌గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 36.73 పోలింగ్ నమోదు
2:30 PM, 7 Dec

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 39.83 పోలింగ్ నమోదు
1:38 PM, 7 Dec

ఫైరింగ్ జరిగిన సిసాయ్ బూత్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు
1:33 PM, 7 Dec

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రఘుబర్ దాస్
1:32 PM, 7 Dec

గుమ్లాలో ఘర్షణ, కాల్పులు జరిపిన పోలీసులు, ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
11:58 AM, 7 Dec

జార్ఖండ్ రెండో దశ పోలింగ్

ఉదయం 11 గంటల సమయానికి 28.5శాతం పోలింగ్ నమోదైంది
10:31 AM, 7 Dec

సమస్యాత్మక నియోజకవర్గం మందార్‌‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..పెద్ద సంఖ్యలో బారులు తీరిన ఓటర్లు
10:22 AM, 7 Dec

చక్రధర్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న జార్ఖండ్ బీజేపీ చీఫ్ లక్షణ్
10:00 AM, 7 Dec

జంషెడ్ పూర్ పోలింగ్ బూత్ నెంబర్ 21లో తన ఓటు హక్కు వినియోగించుకున్న జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్
9:43 AM, 7 Dec

రెండో దశ పోలింగ్‌లో అదృష్టం పరీక్షించుకున్న జార్ఖండ్ సీఎం, స్పీకర్, మరికొంతమంది మినిస్టర్స్
9:37 AM, 7 Dec

సగటు ఆస్తి 71.68 లక్షలు

జార్ఖండ్ రెండో విడుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సగటు ఆస్తి 71.68 లక్షలు
9:36 AM, 7 Dec

కుంతీలో కొనసాగుతున్న పోలింగ్
9:35 AM, 7 Dec

చైబాస్‌లో కొనసాగుతున్న పోలింగ్
9:27 AM, 7 Dec

రెండో దశ పోలింగ్ లో రాజకీయ పార్టీలు

అఖిలభారత తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు అభ్యర్ధులు కూడా రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నారు జార్ఖండ్ వికాస్ మోర్చా 20 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. బహుజన సమాజ్ పార్టీ 14 స్థానాల్లో బరిలో ఉంది. వామపక్ష సిపిఐ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది. సి పి ఐ ఎం ఒక స్థానంలోనూ, ఎన్సీపీ రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తుంది.
9:20 AM, 7 Dec

జార్ఖండ్ పోలింగ్

జార్ఖండ్ పోలింగ్
మొదటి దశ పోలింగ్ నవంబర్ 30న ముగిసింది. ఐదవ మరియు చివరి దశ పోలింగ్ డిసెంబరు 20 న జరగనుంది. నేడు రెండో దశ పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 23వ తేదీన లెక్కింపు జరగనుంది
9:10 AM, 7 Dec

ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు

రెండవ దశ ఎన్నికలకు మొత్తం 20 నియోజకవర్గాల్లో బిజెపి పోటీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి వరుసగా 14, ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మొత్తం మూడు ప్రతిపక్ష పార్టీల కూటమి తరపున 7 సీట్లు పొందిన అతడికి రెండో దశ పోలింగ్లో అభ్యర్థి లేరు. ఝార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ దినేష్ ఒరాన్ సిజాయ్ బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి, బీజేపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నీల్కాంత్ సింగ్ ముండా ఖుంటి బరిలో ఉన్నారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా చక్రధర్ నుండి పోటీలో ఉన్నారు.
9:05 AM, 7 Dec

పోలింగ్ విధుల్లో భద్రత సిబ్బంది

గిరిజన రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 20 నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో సర్వే 42 వేల మంది పైగా భద్రతా సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉన్నారు.
8:55 AM, 7 Dec

రెండో దశ పోలింగ్లో బరిలో ముఖ్యమంత్రి

రెండో దశ పోలింగ్లో బరిలో  ముఖ్యమంత్రి
రెండో దశ పోలింగ్ లో బరిలోకి దిగిన ప్రముఖ నాయకులలో తూర్పు నుండి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఉన్నారు. అక్కడ ఆయనపై గత క్యాబినెట్ లో కలిసి పనిచేసిన, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్యు రాయ్ పోటీలో ఉన్నారు.
8:44 AM, 7 Dec

67 మందికి నేర చరిత్ర..

జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసే 260 మంది అభ్యర్థుల్లో 67 మందికి నేర చరిత్ర.. పెండింగ్‌లో క్రిమినల్ కేసులు
8:25 AM, 7 Dec

మహిళా అభ్యర్థులు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ లో 29 మంది (11 శాతం) మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
8:13 AM, 7 Dec

44 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు

44 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది.
8:00 AM, 7 Dec

అభ్యర్థుల వయస్సు

మొత్తం 104 మంది అభ్యర్థులు తమ వయస్సు 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్టు ప్రకటించారు. 131 మంది తమ వయస్సు 41 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. 22 మంది అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. ముగ్గురు తమ వయసును ప్రకటించలేదు.
7:43 AM, 7 Dec

12 నియోజకవర్గాల్లో

2019 జార్ఖండ్ రెండో విడుత ఎన్నికల్లో సుమారు 12 నియోజకవర్గాల్లో ప్రతీ ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది
6:06 AM, 7 Dec

ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు

2019 జార్ఖండ్ రెండో విడుత ఎన్నికల్లో ఆరుగురు ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
READ MORE

English summary
Voting for the Jharkhand assembly election 2019's second phase will begin from 7 am and will conclude at 5 pm. Voters from the 20 constituencies of the state will exercise their voting rights and elect their representatives from 260 candidates in phase 2 of the assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X