వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ, ఎన్ఆర్సీ కారణం, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అరవింద్ కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికికి పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజిష్టర్ కారణమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను తీర్పుగా ప్రజలు ఇచ్చారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ రాజీనామా, గవర్నర్‌కు లేఖ అందజేత, ఆపద్దర్మ సీఎంగా కొనసాగింపుజార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ రాజీనామా, గవర్నర్‌కు లేఖ అందజేత, ఆపద్దర్మ సీఎంగా కొనసాగింపు

జార్ఖండ్ ఎన్నికల్లో ప్రజలతీర్పుతో వారు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్‌ను కేజ్రీవాల్ అభినందించారు. రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కారణం ఆ పార్టీ ప్రభావం చూపకపోవడమేనని అన్నారు. మరోవైపు ఓటమిని బీజేపీ చీఫ్ అమిత్ షా అంగీకరించారు. కాంగ్రెస్ కూటమికి అభినందనలు తెలిపారు. ఇటు ప్రధాని మోడీ కూడా హేమంత్ సోరెన్‌ను విష్ చేశారు.

Jharkhand Results Against Citizenship Law, NRC: arvind Kejriwal

అంతకుముందు జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడంతో రాజ్‌భవన్ వచ్చి గవర్నర్ ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్దర్మ సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు.

English summary
Jharkhand Results Against Citizenship Law, NRC arvind Kejriwal said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X