వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో హిప్ ఇంప్లాంట్స్‌కు సంబంధించి నకిలీ పరికరాలను జాన్సన్‌ అండ్ జాన్సన్ సంస్థ సరఫరా చేసింది. వాటినే బాధితులకు వైద్యులు అమర్చారు. అయితే అవి అమర్చిన తర్వాత కొత్త జబ్బులు తలెత్తడంతో వైద్యులు మళ్లీ పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది.

తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మేలో బాధితులకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను ఆదేశించింది. ఇలా మొత్తం 67 మంది పేషెంట్లకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ముగ్గురు పేషెంట్లకు డబ్బులు చెల్లించిందని ఉత్తర్ ప్రదేశ్ డ్రగ్ లైసెన్సింగ్ మరియు కంట్రోల్ ఆఫీసర్ ఏకే జైన్ తెలిపారు.

Jhonson and Jhonson pays Rs.25 lakh to victims in UP for faulty hip implants

అంతకుముందు ఒక్కొక్కరికీ రూ. 65 లక్షలు, రూ.74 లక్షలు పరిహారంగా చెల్లించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అంత డబ్బు చెల్లించలేమని చెబుతూ ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ బారిన పడిన పేషెంట్ల జాబితాను సమర్పించాల్సిందిగా కోర్టు కోరింది. జాబితాను పరిశీలించిన కోర్టు బాధితులకు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ డబ్బులను పేషెంట్లకు చెల్లించినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.

English summary
Pharmaceutical Major Johnson and Johnson said it has paid Rs 25 lakh each to three victims of its faulty acetabular surface replacement (ASR) hip implants in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X