వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియాఖాన్ తల్లి కాళ్ల వద్ద కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు పైన సిబిఐ ఛార్జీషీటుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా, మరో విషయం బహిర్గతమైంది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఓ రోజు రాత్రి ప్రియుడు సూరజ్ పంచోలీని అతని తండ్రి ఆదిత్య పంచోలీ జియా తల్లి వద్దకు తీసుకు వచ్చాడని తెలుస్తోంది.

ఆ సమయంలో జియాఖాన్ తల్లి కాళ్ల వద్ద కూర్చొని ఆదిత్య పంచోలీ (సూరజ్ తండ్రి) వెక్కి వెక్కి ఏడ్చాడని ఛార్జీషీటులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

సమాచారం మేరకు... 23 ఏళ్ల హౌస్ హెల్ప్ (పని మనిషి) పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. జియాఖాన్ ప్రియుడు సూరజ్ ఇంటికి ఏడుస్తూ వచ్చింది. ఆమె తన లగేజీతో పాటు వచ్చింది. ఆ సమయంలో జియాఖాన్, సూరజ్ ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

Jiah Khan suicide: Sooraj was aware of Jiah's acute depression

ఆ తర్వాత, సూరజ్ తనతో మాట్లాడుతూ... తాను జియాఖాన్ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడని ఆ హౌస్ హెల్ప్ చెప్పాడు. తనకు సూరజ్ కొన్ని సూచనలు కూడా చేశాడని చెప్పాడు. జియాఖాన్‌ను ఒంటరిగా వదలవద్దని తనకు సూచించాడని పని మనిషి చెప్పాడు. జియా, సూరజ్ ఇద్దరు గట్టిగా వాదించుకోగా తాను చూశానని అతను చెప్పాడని తెలుస్తోంది.

రాత్రి పదకొండు గంటలకు సూరజ్ తనకు ఫోన్ చేశాడని, జియాఖాన్ గురించి అడిగాడని ఆ హౌస్ హెల్ప్ చెప్పాడు. సూరజ్ ఎంత ఫోన్ చేసినా జియాఖాన్ తీయలేదని, దీంతో తనను అడిగాడన్నాడు. తాను లోనికి వెళ్లి చూడగా.. ఆమె చేతికి గ్లాస్‌తో ఏర్పడిన గాయం కనిపించిందని, రక్తం కారిందని, సోఫాలో పడిపోయి ఉందని అతను చెప్పాడు.

ఆ రోజే జియాఖాన్ మృతి చెందింది. ఆ సమయంలో సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలీ ఆమె ఇంటికి వచ్చారని, జియాఖాన్ తల్లి రబియా ఖాన్ పాదాల వద్ద వెక్కివెక్కి ఏడ్చారని హౌస్ హెల్ప్ చెప్పాడు.

English summary
It was also reported that on the night when Jiah passed away, Sooraj's father, Aditya Pancholi, came to her residence and sat at her mother Rabiya khan's feet and wept uncontrollably.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X