వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూరమైందని ప్రియురాలి నాలుక కొరికేశాడు

|
Google Oneindia TeluguNews

Jilted lover bites off bride's tongue in Odisha
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణం చోటు చేసుకుంది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటోందని ఆగ్రహానికి గురైన ఓ దుండగుడు తన ప్రియురాలి నాలుక కొరికేశాడు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో జరిగిందని, కొద్ది నిమిషాల్లో ఆమె వివాహం జరుగుతుందనగా ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు.

రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని భంజానగర్ పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వివాహా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి కూతురు కూడా ఓ వాహనంలో షాపింగ్‌కు వెళ్లింది. సామాగ్రిని కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులు వాహనం దిగి షాపులోకి వెళ్లగా పెళ్లి కూతురు మాత్రం ఆ వాహనంలో ఉండిపోయింది.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె ప్రియుడు సుకంత స్వేన్(35) ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అంతేగాక ఆమె నాలుకను కొరికాడు. అక్కడి నుంచి ఆమెను ఎత్తుకెళ్లేందుకూ ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు సుకంత స్వేన్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన బాధితురాలు నాలుకను అంటించేందుకు కొంత సమయం పడుతుందని, శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. కాగా బాధితురాలు, నిందితుడు ఒకే గ్రామం జిలిభాకు చెందిన వారు. అయితే ప్రియుడిగా చెప్పుకుంటున్న నిందితుడు సుకంతకు ఇప్పటికే వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

English summary

 Angry over the marriage of the woman he loved, a man bit off her tongue in Odisha's Ganjam district minutes before her wedding with another man, police said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X