• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Jindal steel: రెబల్స్ దెబ్బతో సీఎం కూల్, స్టీల్ కంపెనీకి కేటాయించిన భూములకు చెక్, కొడుకు !

|

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీలోని కొందరు నేతల దెబ్బతో ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. సొంత పార్టీలోని రెబల్ నాయకులను బుజ్జగించడానికి సీఎం బీఎస్. యడియూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన 3, 667 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునింది. జిందాల్ స్టీల్ ప్లాంట్ కు వేల ఎకరాలు కట్టబెట్టడంపై ఆ రాష్ట్రలోని కొందరు మంత్రులు బహిరంంగా మండిపడుతున్నారు. సీఎం కొడుకు తీరుతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

Bengaluru: ఐటీ హబ్ లో విదేశీ యువతి గ్యాంగ్ రేప్, వీడియో వైరల్, మర్మాంగంలో బీర్ బాటిల్ తో ? షాక్ !Bengaluru: ఐటీ హబ్ లో విదేశీ యువతి గ్యాంగ్ రేప్, వీడియో వైరల్, మర్మాంగంలో బీర్ బాటిల్ తో ? షాక్ !

 జిందాల్ ఎఫెక్ట్ తో జిగేల్ జిగేల్

జిందాల్ ఎఫెక్ట్ తో జిగేల్ జిగేల్

బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ (JSW)కు 3, 667 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2006లో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది. జిందాల్ స్టీల్ కంపెనీకి భూమి కేటాచయించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. బీఎస్. యడియూరప్ప తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నాయకులే వ్యతిరేకించడంతో వివాదం పెద్దది అయ్యింది.

 సరైన నిర్ణయం తీసుకుంటాము

సరైన నిర్ణయం తీసుకుంటాము

జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాంచిన భూమి వివాదంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక సీనియర్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇప్పటికే జిందాల్ భూమి వివాదం సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని, ప్రస్తుతానికి ఆ భూమిని ఆ కంపెనీకి కేటాంచకూడదు అంటూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని, సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిన తరువాత సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీనియర్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

 ఢిల్లీలో రెబల్స్ దెబ్బ

ఢిల్లీలో రెబల్స్ దెబ్బ

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను మార్చాలని సీనియర్ మంత్రి అరవింద్ లింబాలి, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ఆపరేషన్ కమలలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, సీనియర్ మంత్రి సీపీ. యోగేశ్వర్ తో పాటు 8 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఈ సీఎంను మార్చేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది. సీఎం బీఎస్. యడియూరప్ప వ్యతిరేక వర్గం ఢిల్లీలోనే మకాం వేసిన సమయంలో సీఎం బీఎస్. యడియూరప్ప ఇక్కడ ఆనేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు .

 ఎవరి ధీమా వాళ్లదే

ఎవరి ధీమా వాళ్లదే

బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు సీఎంగా యడియూరప్ప కొనసాగుతారని, అందులో ఎలాంటి డౌట్ లేదని సీఎం వర్గీయులు ధీమాగా చెబుతున్నారు. అయితే సీఎం మార్చు కచ్చితంగా ఉంటుందని, యడియూరప్ప ఎవరి పేరు ప్రతిపాదిస్తే ఆయనే సీఎంగా ఉంటారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. సీఎం యడియూరప్ప నాయకత్వంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం కేవలం వారిఊహగానాలు మాత్రమే అని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ హైకమాండ్ కూడా మౌనంగా ఉండటం అనేక ఊహాగానాలకు తెర లేపింది.

 సీఎం యడియూరప్ప కూల్

సీఎం యడియూరప్ప కూల్

సీఎం బీఎస్. యడియూరప్ప మీద తనకు ఎలాంటి కోపం లేదని, ఆయన కొడుకు బీవై, విజయేంద్ర విషయంలోనే కొందరు నాయకులకు కోపం ఉందని కర్ణాటక సీనియర్ మంత్రి సీపీ, యోగేశ్వర్ అంటున్నారు. సీఎం యడియూరప్పను మార్చాలని ఢిల్లీలో మకాం వేసిన నాయుల్లో ప్రముఖఉడైన సీపీ. యోగేశ్వర్ చక్రం తిప్పుతున్నారు. మొదటి నుంచి సీపీ. యోగేశ్వర్ జిందాల్ కు భూముల కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ పరిణామాలతో సీఎం బీఎస్. యడియూరప్ప జిందాల్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాని డిసైడ్ అయ్యారని తెలిసింది. సీఎం యడియూరప్ప కూల్ గా వ్యవహరిస్తు సొంతపార్టీలోని రెబల్స్ ను బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.

  Arogya Sri వల్ల రోజూ 25000 మందికి Covid చికిత్స జరుగుతుంది - Ys Jagan || Oneindia Telugu
  English summary
  Jindal steel: On a day that Karnataka Chief Minister B S Yediyurappa indicated that efforts to remove him had been rebuffed by the BJP central leadership, the state cabinet decided not to proceed with a controversial decision to sell 3,667 acres of land in the Ballari region to steel major JSW Steel as part of a 2006 agreement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X