వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనెక్టివిటీలో అదే మొదటి స్థానం..! ఆ జియో టన్ ట నాటన్..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : భారత్ లో జియో నెట్ వర్క్ రాజ్యమేలుతోంది. దాని కన్నా ఎంతో కాలం ముందోచ్చిన నెట్ వర్క్ లను తోసిరాజంటూ కెనెక్టివిటీలో అగ్రస్థానానికి చేరుకుంది. రిలయన్స్‌ జియో అత్యధిక వేగం 4జీ సేవలతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, అంతే వేగంతో మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్ని మూడేళ్లలోపే అధిరోహించింది. జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో జియో ఈ ఘనత సాధించింది.

వాణిజ్య సేవలను ఆరంభించి (2016 సెప్టెంబరు) మూడేళ్లు కూడా పూర్తికాకముందే, దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది. ఈ ఏడాది జూన్‌లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా, వొడాఫోన్‌ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఆయా సంస్థల ఆర్థిక ఫలితాల్లోనే ఈ గణాంకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో 33.41 కోట్ల కనెక్షన్లు వొడాఫోన్‌ ఐడియాకు ఉండగా, జూన్‌ త్రైమాసికం చివరకు కనెక్షన్లు 32.0 కోట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ వెల్లడించింది.

jio First place in connectivity ..!

ప్రతినెలా కనీస రీఛార్జి చేసుకుంటేనే, ఇన్‌కమింగ్‌ సేవలు లభిస్తాయనే షరతు విధించడం వల్లే కనెక్షన్లు తగ్గాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. వాస్తవానికి వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ సంస్థల విలీనంతో ఏర్పాటైన వొడాఫోన్‌ ఐడియాకు 40 కోట్లకు పైగా కనెక్షన్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించినా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రతినెలా చందాదార్లను కోల్పోతూ రావడం వల్లే, ప్రస్తుతం రెండోస్థానానికి పరిమితమైంది.

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో గత మే నెలలోనే భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించి, రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. మే నెలలో 32.29 కోట్ల కనెక్షన్లతో 27.80 మార్కెట్‌ వాటాను సంస్థ సాధించిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ నెలలో ఎయిర్‌టెల్‌ కనెక్షన్లు 32.04 కోట్లు కాగా, 27.6 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.

English summary
Jio network in India. Connectivity has topped the network in the long run. Reliance Jio has entered the telecom sector with high speed 4G services and has reached the top spot in the country in terms of mobile connections in three years. Jio achieved this in June with over 33.13 crore mobile connections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X