వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో దెబ్బ: 11.7% పడిపోయిన టెలికం రెవిన్యూ, ఈ ఏడాది 38% తగ్గుదల?

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం ఇండస్ట్రీ ఏడాదికి 11.7 శాతం పడిపోయిందని జెప్పరీస్ రిపోర్ట్ వెల్లడించింది. ఉచిత ఆఫర్లతోనే రిలయన్స్ మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జియో దెబ్బ: 11.7% పడిపోయిన టెలికం రెవిన్యూ, ఈ ఏడాది 38% తగ్గుదల?

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం ఇండస్ట్రీ ఏడాదికి 11.7 శాతం పడిపోయిందని జెప్పరీస్ రిపోర్ట్ వెల్లడించింది. ఉచిత ఆఫర్లతోనే రిలయన్స్ మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడమే సంచలనంగా మారింది. ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు జియో చుక్కలను చూపింది.

రిలయన్స్ దెబ్బకు ఇతర టెలికం నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు తమ టారిఫ్ రేట్లను కూడ మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రత్యర్థి కంపెనీలు ఇచ్చే టారిఫ్ రేట్ల కంటే తక్కువ రేట్లకే డేటాను, వాయిస్ కాల్స్ ను ఇస్తూ జియో ప్రకటించింది.దీంతో ఇతర కంపెనీలు కూడ జియోతో సమానమైన టారిఫ్ రేట్లను ప్రకటించాల్సిన పరిస్థితులు దాపురించాయి.

ఏటా 11.7% రెవిన్యూ నష్టం

ఏటా 11.7% రెవిన్యూ నష్టం

రిలయన్స్ జియో కారణంగా టెలికం పరిశ్రమ ప్రతి ఏటా సుమారు 11.7 శాతం రెవిన్యూను కోల్పోయిందని జెఫ్పరీస్ రిపోర్ట్ వెల్లడించింది. ఏకధాటిగా జియో చందాదారుల సంఖ్య పెరిగిపోతోంది. 2016-17 నాటికే ప్రకటించిన ఉచిత ఆఫర్ల కారణంగా 11.7 శాతం తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. జియో చందాదారుల వృద్ది, 2016-17 నాలుగో క్వార్టర్ ముగిసేవరకు కంపెనీ చేసిన ఆఫర్లు ఇండస్ట్రీ రెవిన్యూను దెబ్బతీశాయని ఆ నివేదిక వెల్లడిస్తోంది.

ఈ ఏడాది కూడ 38% రెవిన్యూ తగ్గిపోయే అవకాశం

ఈ ఏడాది కూడ 38% రెవిన్యూ తగ్గిపోయే అవకాశం

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడ సెక్టార్ రెవిన్యూలు 38 శాతం పడిపోయే అవకాశం ుందని టెలికాం డిపార్ట్ మెంట్ అంచనావేస్తోంది. అంటే 17 వేల కోట్ల రెవిన్యూలు కనుమరుగయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

మెట్రో నగరాల్లో రెవిన్యూ ఎక్కువగా నష్టం

మెట్రో నగరాల్లో రెవిన్యూ ఎక్కువగా నష్టం

రిలయన్స్ జియో ఎఫెక్ట్ ఎక్కువగా మెట్రో నగరాలు, ఏ సర్కిళ్ళలో ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో అత్యధిక వ్యాప్తి చెందిందని నివేదిక తెలిపింది. అక్కడే స్మార్ట్ ఫోన్ ఏకో సిస్టమ్ కూడ మెరుగ్గా అభివృద్ది చెందిందని కూడ రిపోర్ట్ వెల్లడించింది. నాలుగో క్వార్టర్ ముగిసేవరకు రిలయన్స్ జియో చందాదారుల బేస్ ఎలాంటి బ్రేక్ లు లేకుండానే 10.8 కోట్ల మేర దూసుకుపోయిందని ఆ రిపోర్ట్ తేల్చింది.

అత్యధిక స్మార్ట్ ఫోన్లలో జియో

అత్యధిక స్మార్ట్ ఫోన్లలో జియో

తాజా నెలలోనే జియో ఆడిక్షన్ కొంచెం తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. భారత్ లోని 4 జీ స్మార్ట్ ఫోన్ల బేస్ 13.1 కోట్లుంటే దానిలో 86 శాతం డివైజ్ లలో జియోనే వాడుతున్నారని జెప్ఫరీస్ నివేదిక వెల్లడించింది. వీరిలో 61 శాతం మంది యాక్టివ్ యూజర్లుగా ఉన్నట్టు పేర్కొంది. డేటా సర్వీసులు ఎక్కువ వృద్ది చెందడం , వాయిస్ లు పడిపోవడం , ఆపరేటర్లు తక్కువ పెట్టుబడులు వారి రెవిన్యూలు పడిపోవడానికి దారితీశాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం టాప్ 3 లో ఉణ్న ఆపరేటర్లే 76 శాతం మార్కెట్ షేర్ ను కలిగి ఉన్నారు. కానీ, వారి రెవిన్యూలకు దెబ్బపడడం, ఇండస్ట్రీ రెవిన్యూలకు కూడ గండికొట్టినట్టైంది.

English summary
The growth of Reliance Jio subscriber base and its free offering till 2016-17 fourth quarter has led to a 11.7 per cent year-on-year decline (8.5 per cent quarter-on-quarter decline) in industry revenues, a report by Jefferies said here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X