వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోగిగాఫైబర్‌తో టీవీ, 4కె కనెక్షన్ కూడా.. ఎలా రిజిష్టర్ చేసుకోవాలో తెలుసుకొండిలా ..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రిలయన్స్ అంటే సంచనాలకు మారుపేరు. జియోతో 4జీ నెట్‌వర్క్‌ను సామాన్యుడి చేతిలో ఉంచారు. ఇప్పుడు జియో గిగా ఫైబర్ కూడా మరో ట్రెండ్ సెట్ చేయబోతోంది. గిగా ఫైబర్‌తో కంపెనీ భారీ ఆఫర్స్ ప్రవేశపెట్టబోతునట్టు ప్రకటించింది. దీంతో టీవీ, 4 కే కనెక్షన్, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. అయితే మీరు ఎంపికచేసుకునే ప్లాన్‌ను బట్టి ఆఫర్స్ వర్తిస్తాయని షరతు విధించారు.

వచ్చేనెల 5న జియో గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటి ప్లాన్స్ రూ.700 నుంచి రూ. 10 వేల వరకు ఉంటాయి. ఇంటర్నెట్ డేటా స్పీడ్ 100 ఎంజీబీఎస్‌తో మొదలై 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది. గిగాఫైబర్ కనెక్షన్‌తో ఆకర్షణీయమైన లాభాలు కూడా ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. వివిధ ఫ్లాన్లతో వినియోగదారులకు ఆకట్టుకునే ఫీచర్స్ అందిస్తామని చెప్తున్నాయి.

jio giga fiber connction with tv, 4 k connection also

వినియోగదారుడు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఉచితంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్ఈడీ టీవీని కూడా పొందొద్దు. అన్ లిమిటెడ్ కాలింగ్‌తో ఉచితంగా ల్యాండ్ లైన్ కనెక్షన్, 4 కే సెట్ టాప్ బాక్స్ కూడా అందజేస్తారు. గిగా ఫైబర్ వచ్చే బెనిఫిట్స్ అన్నీ సబ్ స్కేబర్లు ఎంచుకునే ప్లాన్స్‌ను బట్టి ఉంటాయి. గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకోవడానికి https://gigafiber.jio.com/registration రిజిష్టర్ కావాలి. తొలుగా జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

తర్వాత యువర కరెంట్ లొకేషన్‌లో గిగాఫైబర్ కనెక్షన్ కోరుకుంటున్న అడ్రస్ టైప్ చేయాలి. లేదంటే పక్కనే ఉన్న మ్యాప్‌లో లొకేషన్ సెట్ చేయాలి. తర్వాత పేజీలో పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐటీ టైప్ చేసి .. ఓటీపీ జనరేట్ చేయాలి. ఫోన్‌కు వచ్చిన ఓటీపీని వెరిఫై చేయాలి. తర్వాత రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపి .. మీ ఐడీ ఫ్రూప్, అడ్రస్ ప్రూఫ్ వెరిఫై చేయడంతో మీకు కనెక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది.

English summary
jioGigaFiber services will be available on the 5th september. Their plans range from Rs.700 Up to 10 thousand. Internet data speed is 100Gbps and up to 1Gbps. The company also announced attractive profits with the Gigafiber connection. It claims to offer impressive features to customers with different flan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X