వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌన్ బనేగా క్రోర్‌పతి 2017: అవకాశం కల్పించనున్న జియో

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Reliance Jio Phone recharge plans, need RS 153 per month

ముంబై: రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనాలతో ప్రారంభమైంది. రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తూనే ఉంది. తాజాగా కౌన్ బనేగా క్రోర్‌పతి 2017 సీజన్ లక్ష్యంగా జియో కొత్త స్కీమ్‌కు శ్రీకారాన్ని చుట్టింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశంతోనే సంచలనాలకు వేదికగా నిలిచింది. రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఉచిత ఆఫర్లను ప్రకటించింది. ఆరు మాసాల పాటు ఉచిత ఆఫర్లను ఇచ్చింది జియో.

జియో ఇచ్చిన ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు తీవ్రంగా నష్టాలపాలయ్యాయి. దీంతో జియో బాటలోనే ఇతర టెలికం కంపెనీలు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు జియో ఫీచర్ ఫోన్‌ను సెప్టెంబర్ 1వ, తేది నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

ఇప్పటికే ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభమయ్యాయి. తాజాగా 2017 కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమానికి సంబంధించి జియో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. జియో ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కనుంది.

కౌన్ బనేగా క్రోర్‌పతి 2017లో పాల్గొనే అవకాశం

కౌన్ బనేగా క్రోర్‌పతి 2017లో పాల్గొనే అవకాశం

మొబైల్ వినియోగదారులను సంచలన ఆఫర్లతో ముంచెత్తున్న రిలయన్స్ జియో... మరో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 2017' సీజన్ దగ్గరపడుతుండడంతో... సదరు టీవీ షో చూసే లక్షలాదిమంది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) టీవీ షోను లైవ్‌లో చూస్తూ... దానికి సమాంతరంగా ఆన్‌లైన్‌లో కేబీసీ ఆడే అవకాశం కల్పించనుంది. దీనికి చేయాల్సిందల్లా జియో చాట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని... జియో కేబీసీ ప్లే ఎలాంగ్‌లోకి లాగిన్ కావడమే. ఇప్పటికే జియో సిమ్ వాడుతున్నట్టయితే లాగిన్ కావాల్సిన అవసరం లేకుండానే జియోచాట్ ఆన్‌లైన్ గేమ్‌లోకి వెళ్లవచ్చు.

జియో చాట్ ద్వారా సమాధానం

జియో చాట్ ద్వారా సమాధానం

టీవీ చానెల్‌లో కేబీసీ ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా అదే ప్రశ్నకు జియో చాట్‌లో కనిపించిన ఆప్షన్ల నుంచి సమాధానం పంపాలి. హాట్ సీట్‌లో కూర్చున్న పోటీదారుడు సమాధానం చెప్పకముందు లేదా సమయం ముగిసేలోపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గా జవాబు చెబితే హాట్ సీట్ కంటెస్టెంట్‌తో పాటు తదుపరి ప్రశ్నకు వెళ్లవచ్చు. అయితే ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పుగా చెప్పినా మీ రౌండ్ ముగిసినట్టే.

కొత్త వారితో కొత్త రౌండ్

కొత్త వారితో కొత్త రౌండ్


తర్వాత కొత్త రౌండ్‌ వేరే వాళ్లతో మొదలవుతుంది. మొత్తం జియో కేబీసీ ప్లే ఎలాంగ్ గేమ్ వివిధ రౌండ్లలో పలురువు ప్లేయర్లతో జరుగుతుంది. సరైన ఆన్సర్లు చెప్పిన వారికి ఆ రౌండ్‌ను బట్టి పాయింట్లు లభిస్తాయి. తర్వాతి రోజు విజేతలను కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రకటిస్తారు. ఇందుకోసం కేబీసీతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటోంది. ‘ఘర్ బేటే జీతో' విజేతలందరికీ డాట్సన్ రెడిగో కారును బహూకరిస్తారు. జియోకి బయట ఉన్న వినియోగదారులు కూడా ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని ఆడవచ్చు. అయితే బహుమతి వస్తే మాత్రం వాళ్లు జియో సిమ్ కొనాల్సి రావచ్చునని చెబుతున్నారు.

సంచలనాలకు వేదికగా మారిన జియో

సంచలనాలకు వేదికగా మారిన జియో

రిలయన్స్ జియో సంచలనాలకు వేదికగా మారింది. ఉచిత వాయిస్‌కాల్స్, డేటా ఆఫర్లతో రిలయన్స్ జియో సంచలనాలకు తెరతీసింది. ఈ సంచనాలను కొనసాగిస్తూనే ఉంది. కొత్త ఆఫర్లతో జియో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. కెబిసి ప్రోగ్రాం ద్వారా జియో మరింత సంచలనాలకు కేంద్రంగా మారే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
With the recent move, Jio is aiming at the audience who watch the KBC show on their mobile or TV. You will see a Jio contestant at the show during the Fastest-Finger-First rounds. The participants can make it to the Jio chair by taking part in qualifying rounds that are exclusive for Jio number users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X