వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో షాక్: వాయిస్‌కాల్స్ రోజూ 300 నిమిషాలేనా, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తమ కస్టమర్లకు షాకివ్వనుంది రిపోర్ట్‌లు చెబుతున్నాయి.తమ నెట్‌వర్క్‌పై రోజుకు 300 నిమిషాల పాటు కాల్స్‌ను మాత్రమే వాడుకొనేలా రిలయన్స్ జియో నిబంధన పెట్టనున్నట్టు రిపోర్టులు తెలిపాయి.

రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆరు మాసాల పాటు ఉచితంగా వాయిస్ కాల్స్‌ను, డేటాను రిలయన్స్ జియో ఇచ్చింది.

ఆరు మాసాల తర్వాతి నుండి రిలయన్స్ జియో తన కష్టమర్ల నుండి డబ్బులు వసూలు చేస్తోంది. అయితే వాయిస్ కాల్స్ విషయంలో జియో కష్టమర్లు దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయాన్ని రిలయన్స్ జియో అభిప్రాయపడుతోందని రిపోర్ట్‌లు వెల్లడిస్తున్నాయి.

అయితే అపరిమిత కాల్స్‌ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోనేందుకు వాయిస్ కాల్స్ విషయాన్ని కొన్ని నిమిషాలకే పరిమితం చేయాలని జియో భావిస్తోందని సమాచారం.

వాయిస్ కాల్స్‌ను రోజుకు 300 నిమిషాలకే పరిమితం?

వాయిస్ కాల్స్‌ను రోజుకు 300 నిమిషాలకే పరిమితం?

వాయిస్‌కాల్స్ దుర్వినియోగం కాకుండా చేసేందుకుగాను జియో కొత్త పద్దతిని తీసుకురావాలనే యోచిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.తమ నెట్‌వర్క్‌పై కేవలం రోజుకు 300 నిమిషాల కాల్స్‌ను మాత్రమే వాడుకునేలా జియో నిబంధన పెట్టబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి. అపరిమిత కాల్స్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంలో ఈ కాల్స్‌ను పరిమితం చేస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. టెలికాంటాక్‌కు జియో ప్రియారిటీ టీమ్‌ ఈ విషయాన్ని నిర్థారించిందని నివేదికల సారాంశం.

జియో సేవలు పక్కదారిపట్టకుండా

జియో సేవలు పక్కదారిపట్టకుండా

కొందరు యూజర్లకు రోజుకు 300 నిమిషాల వాయిస్‌ కాల్స్‌ను మాత్రమే జియో పరిమితం చేయాలని భావిస్తోందని సమాచారం. జియో అపరిమిత కాల్స్‌ ఫీచర్‌తో కొందరు యూజర్లు రోజుకు 10 గంటలకు పైగా వాడుకుంటూ ఉచిత వాయిస్ కాల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని జియో గుర్తించింది. ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా రిపోర్టు వెల్లడించింది.

4జీ డేటాపై పరిమితుల వలే

4జీ డేటాపై పరిమితుల వలే

4జీ డేటా వాడకం లాగానే వాయిస్‌ కాల్స్‌పైనా పరిమితి తేవాలని యోచిస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌లో జియో సేవలు లాంచ్‌ అయినప్పుడు అపరిమిత 4జీ డేటాను ఆఫర్‌ చేసింది. అయితే డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో, తరువాత డేటా వాడకంపై పరిమితి పెట్టింది. ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్‌ చేస్తోంది. అపరిమిత డేటా వాడకం ఉన్నప్పటికీ, 1జీబీ డేటా వాడకం అయిపోయిన తర్వాత డేటా స్పీడు 100 కేబీపీఎస్‌ కంటే పడిపోయింది.

కొందరికే వాయిస్‌కాల్స్‌పై పరిమితి

కొందరికే వాయిస్‌కాల్స్‌పై పరిమితి

ప్రస్తుతం వాయిస్‌ కాల్స్‌పై పరిమితిని కొందరు యూజర్లకే వర్తింపజేయాలని చూస్తోందని సమాచారం. జియో నెట్‌వర్క్‌ను దుర్వినియోగం చేసేవారికేననే ప్రచారం కూడ ఉంది. అయితే ఎవరు ఈ కేటగిరీ కిందకి వస్తున్నారో ఇంకా స్పష్టం కాలేదు. రోజుకు 10 గంటల కంటే ఎక్కువ వాయిస్‌ కాల్స్‌ను వాడే వారు ఈ కేటగిరీ కిందకి వస్తారంటూ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కాల్స్‌పై గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు జియో. త్వరలోనే విధివిధానాలు వెల్లడించే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

English summary
Reliance Jio is seemingly limiting the calls that its users can make using VoLTE on its network 300 minutes per day for some users who are apparently misusing the "unlimited calls" feature. This limit, according to reports, will not be available to all users, but only for those who are found misusing the network.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X