వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్: 72 జీబీ డేటా ఫ్రీ

ఉచిత ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన రిలయన్స్ జియో మరోసారి ఉచిత ఆఫర్ ను ముందుకు తెచ్చింది. ఎంపిక చేసిన ఎల్ వై ఎఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి 20 శాంత అధికంగా డేటాను అందించనుంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉచిత ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన రిలయన్స్ జియో మరోసారి ఉచిత ఆఫర్ ను ముందుకు తెచ్చింది. ఎంపిక చేసిన ఎల్ వై ఎఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి 20 శాంత అధికంగా డేటాను అందించనుంది.

ఇప్పటికే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకొన్న వారికి రోజుకు 1 జీబీ 4 జీబీ డేటాను , అపరిమిత కాల్స్ ను 90 రోజులపాటు అందిస్తోంది. తాజాగా ఎల్ వైఎఫ్ స్మార్ట్ ఫోన్లకు ఈ ఆఫర్ ను వర్తింపచేయనున్నట్టు ప్రకటించింది జియో.

Jio Offers Up To 72 GB Of Free Data Under New Scheme

మొత్తం 10 రకాలైన ఎల్ వై ఎఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఎర్త్ 1, ఎర్త్ 2, వాటర్ 1, వాటర్ 7ఎన్, వాటర్ 8, వాటర్ 10, 11, ఎఫ్ 1, ఎప్ 1ఎస్, విండ్ 4 ఎన్ స్మార్ట్ ఫోన్లు ఈ ఆఫర్ పరిధిలోకి వస్తాయి.

జూన్ 9వ, తేది తర్వాత నుండి ఈ మోడల్ ఫోన్లు కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తోంది. స్టాక్ ఉన్నంతవరకే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతోందని జియో ప్రకటించింది.

ఎల్ వై ఎఫ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసి రూ. 309 లేదా రూ.509 రీ చార్జీ చేసుకొంటే 6 జీబీ లేదా 12 జీబీ 4 జీ డేటా వోచర్ ను అందిస్తారు. రీ చార్జీ చేసుకొన్న 48 గంటల్లో ఈ అదనపు డేటాను పొందవచ్చు. ఈ డేటా వోచర్లను జూన్ 9 నుండి వచ్చే ఏడాది మార్చి 31 లోపుగా మొత్తంగా ఆరుసార్లు వినియోగించుకోవాలి.

ఆఫర్ వర్తించనున్న ఎల్ వైఎఫ్ స్మార్ట్ ఫోన్ లో జియో సిమ్ ను వేయాలి. ఆ తర్వాత మై జియో ఆప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం జియో యాప్ లోని మై వోచర్స్ వెళ్ళి అక్కడ ఉన్న వోచర్లను రీఛార్జీ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది.

English summary
reliance Jio is offering 20 per cent or up to 72 GB of additional 4G data on purchase of select smartphones of brand LYF in a limited-period scheme. Jio's new offer is applicable for both existing Prime members and new customers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X