వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఫోన్ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ఎత్తుగడ!

సంచలనాలకు మారు పేరుగా నిలిచిన రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంచలనాలకు మారు పేరుగా నిలిచిన రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. జియో నుంచి 4జీ వీఓఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఫీచర్‌ ఫోన్‌ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ ఫోన్ పై ఇటు వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనగా.. మరోవైపు ఇతర టెలికాం నెటవర్క్‌లు, ఫీచర్‌ ఫోన్‌ తయారీదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జియోను ఎదుర్కొనేందుకు ఎయిర్ టెల్ కూడా సిద్ధమైంది.

జియో మాదిరిగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేయకుండా.. ఇప్పటికే ఉన్న కంపెనీలతో జట్టుకట్టి బండిల్‌ ఆఫర్లను ప్రకటించాలని ఎయిర్ టెల్ యోచిస్తోంది. ప్రస్తుతం జియో ఒక్కటే దేశంలో వీవోఎల్‌టీఈ సేవలను అందిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ సైతం వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సేవలను ప్రారంభించబోతోంది.

Jio Phone: Airtel Plans to Beat the 'Free' Reliance Phone With Bundled Offers

మరోవైపు జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ ను తీసుకొస్తున్న నేపథ్యంలో ఫీచర్‌ ఫోన్లను తయారుచేసే కంపెనీలు మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, కార్బన్‌ వంటివి కూడా అదే తరహా ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై బండిల్‌ ఆఫర్లను ఇస్తున్న ఎయిర్‌టెల్‌.. ఆయా సంస్థలతో జట్టుకట్టి భవిష్యత్తులో అవి తీసుకురాబోయే ఫోన్లకు బండిల్‌ ఆఫర్లను ప్రకటించనుంది.

తొలుత 10 కోట్ల మంది వినియోగదారులు లక్ష్యంగా జియో తీసుకొస్తున్న ఫీచర్‌ ఫోన్‌లో ప్రస్తుతం ఒక్క సిమ్‌ మాత్రమే వేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం జియో నెట్‌వర్క్‌ మాత్రమే పనిచేసే విధంగా దానిని లాక్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ కూడా ఇదే పద్ధతిని అనుసరించనుంది. ఇక మిగిలిన టెలికాం కంపెనీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో వేచి చూడాల్సిందే!

English summary
The Jio Phone launch saw the company bring a 4G VoLTE-enabled feature phone to the market, one that everyone expects to change the landscape of the low-end segment soon after its release. However, not everyone is looking forward to this change, as it might just mean loss of subscribers for them. Then there are handset makers, who may see their sales slow down if buyers rush towards the Jio Phone in throngs. And Airtel has a plan to use its own resources and those of feature phone manufacturers to contact the impact of the Jio Phone, and ensure its own fortunes are not adversely affected. Airtel plans to join hands with 4G feature phone manufacturers and offer bundled plans for the devices. Airtel has also announced plans to launch 4G VoLTE services by March 2018; Jio is presently the only VoLTE network in the country. Airtel already offers bundled plans for certain smartphones, so this strategy will be an extension of an existing one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X