వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో 4జీ ఫోన్‌: షాకింగ్‌ నిబంధనలు.. భగ్గుమంటున్న కస్టమర్లు

రిలయన్స్‌ జియో ఫోన్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది రిలయన్స్ జియో. జియో 4 జీ ఫోన్ కు సంబంధించి నిబంధనలు, షరతులను సం‍స్థ తాజాగా ప్రకటించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో ఫోన్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది రిలయన్స్ జియో. జియో 4 జీ ఫోన్ కు సంబంధించి నిబంధనలు, షరతులను సం‍స్థ తాజాగా ప్రకటించింది.

కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్‌ నిబంధనలు, తప్పనిసరి రీచార్జ్‌ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్‌ రిటర్న్ విధానాన్ని కంపెనీ తన వెబ్‌సైట్‌ లో పేర్కొంది.

ముఖ్యంగా జియో 4 జీ ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా కస్టమర్‌ డిపాజిట్‌ చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. ఇది తప‍్పనిసరి. లేదంటే .. వినియోగదారుడికి భారీ నష్టం తప్పదు.

Jio Phone Users Will Need to Spend Minimum Rs. 4,500 on Recharges Over 3 Years, Says Jio

అంతేకాదు, వినియోగదారులు మూడు నెలల పాటు ఎలాంటి రీచార్జ్‌లు చేసుకోకుండా ఉంటే రావాల్సిన రిఫండ్‌ మనీ రూ.1500 వెనక్కి రాదు. అలాగే మూడేళ్ల పాటు సంవత్సరానికి కచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్‌ కచ్చితంగా చేసుకోవాలి.

ఒకవేళ మధ్యలోనే జియో ఫోన్‌ వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే మరో బాదుడు భరించాల్సిందే. ఎందుకంటే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారు అదనంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలల లోపు దాన్ని వెనక్కి ఇచ్చేయాలనుకుంటే రూ.1500 , ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలి. ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు ఫైన్‌‌ ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలి.

ఇక మూడో సంవత్సరంలో 36 నెలలు పూర్తయ్యే లోపు జియో ఫోన్ ను వెనక్కి ఇచ్చేయాలనుకున్నట్లయితే.. రూ.500 ఫైన్ కట్టాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఈ నిబంధనలకు లోబడి మాత్రమే వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. ఈ వివరాలన్నీ జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

మరోవైపు ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన వినియోగదారులు జియో తాజా నిబంధనలపై భగ్గుమంటున్నారు. జియో ఉచిత ఆఫర్ల అసలు గుట్టు బట్టబయలైందని మండిపడుతున్నారు. గతంలో ప్రకటించకుండా నిబంధనలు ఇప్పుడు ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

English summary
The Jio Phone is going to cost you much more than you had previously anticipated. As Reliance Jio begins shipping the Jio Phone handset to over six million customers in India, the company has updated its website to share for the first time the terms and conditions it would be imposing on users of the feature phone. At the launch of the Jio-branded phone, Mukesh Ambani, the managing director of Reliance Industries Limited, said it would be effectively free to customers, as the Rs. 1,500 they are paying to Reliance Jio would be refundable after 3 years. But what was not disclosed at the event was that the Jio Phone requires customers to make recharges worth at least Rs. 1,500 every year for the period of 3 years to remain functional, the company states on the website. The company has also disclosed customers will need to pay up to Rs. 1,500 if they wish to return the Jio Phone within 3 years of purchase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X