వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో యూజర్లకు మరో తీపి కబురు: ప్రైమ్ మెంబర్లకు హెచ్చరిక!

జియో యూజర్లకు మరో తీపి కబురు. ముఖేష్ అంబానీ మరో ఆఫర్ ప్రకటించారు. జియో ప్రైమ్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నట్లు ప్రకటించారు. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: జియో యూజర్లకు మరో తీపి కబురు. ముఖేష్ అంబానీ మరో ఆఫర్ ప్రకటించారు. జియో ప్రైమ్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నట్లు ప్రకటించారు. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించారు.

జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన యూజర్లు రూ.303తో రీచార్జ్ చేసుకుంటే ప్యాక్‌తో లభించే డేటాతో పాటు 201 రూపాయల విలువ చేసే 5జీబీ అదనపు డేటా లభిస్తుంది.

రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 301 రూపాయల ఖరీదైన 10జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. మార్చి 31 2017 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదనపు లాభాలు వర్తిస్తాయి.

Jio sweetens offer for Prime members, adds extra 5GB free data

ఇదిలా ఉండగా, జియో యాజమాన్యం ప్రైమ్ మెంబర్‌షిప్‌కు సంబంధించి ఓ విషయం చెప్పింది. రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకొని ఏడాది మొత్తం కేవలం అదనపు లాభాలు మాత్రమే కొన్నింటిని పొందుతారు.

జియో ప్రైమ్ యూజర్లు కూడా ఏదో ఒక ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకోవాలని జియో యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది. లేకపోతే జియో సేవలు నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది.

రీచార్జ్ చేయించకపోతే కాల్స్ చేయడానికి అనర్హులని తేల్చేసింది. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయని తెలిపింది. మూడు నెలల్లోపు ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయించకపోతే సర్వీస్ పూర్తిగా నిలిపివేస్తామని కూడా జియో స్పష్టం చేసింది. జియో ప్రైమ్ యూజర్ల కోసం ఎనిమిది రకాల ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని జియో యాజమాన్యం తెలిపింది.

English summary
Reliance Jio today sweetened the offering for its 'Prime' members saying those recharging with Rs 303 will get an extra 5GB data beyond the 28GB promised under the scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X