• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రాడ్ బ్యాండ్ సేవల్లో జియో మరో విప్లవం : గిగా ఫైబర్ ప్లాన్ వాటి సబస్క్రిప్షన్‌ ధరలు ఇవే..?

|

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాండ్ బ్యాండ్ సేవలతో మరో సంచలనం నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ సేవలు గత ఏడాది నుంచి టెస్టింగ్‌లో ఉన్నాయి.ఇక చాలామంది చర్చించుకుంటున్నది దీని గిగా ఫైబర్ ధర గురించే. టెలికాం రంగంలో తక్కువ టారిఫ్‌లను ప్రవేశపెట్టి మిగతా టెలికాం సంస్థలకు మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చిన జియో సంస్థ... తాజాగా బ్రాడ్ బ్యాండ్ రంగంలో కూడా ఆయా సంస్థలను వెనక్కు నెట్టేస్తుందా అనే చర్చ జరుగుతోంది. జియో టారిఫ్‌లానే జియో గిగా ఫైబర్‌ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలతో పాటు ఇతర సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

గిగా టీవీ సేవల ద్వారా జియో సంస్థ డీటీహెచ్ టీవీ సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇక దీంతో పాటుగా ఉచిత ల్యాండ్ లైన్ కనెక్షన్‌ ఇవ్వడంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. ఒకే సర్వీసుతో మూడు సేవలను పొందొచ్చని సమాచారం. ఇక దీన్ని బలపరుస్తూ మరిన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బ్యాంకమ్-మెరిల్ లించ్ జియో గురించి కొన్ని లీకేజీలు ఇచ్చింది. గిగా ఫైబర్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులకు మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చిన్న హింట్ ఇచ్చింది.

Jio to bring another revolution, may announce 3 Gigafiber plans soon

ఆ మూడు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు ఇలా ఉండే అవకాశం ఉంది.

ప్యాక్ 1: బేసిక్ 100ఎంబీపీఎస్ కనెక్షన్

ఈ ప్లాన్ కింద 100 mbps కనీస స్పీడుతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో అందించనున్నట్లు సమాచారం. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర ఎంతుంటుందో చెప్పకపోయినప్పటికీ ఇది తక్కువలో తక్కువగా నెలకు రూ. 500 నుంచి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇతర సంస్థలకు చెందిన బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లకంటే తక్కువగా ఉంటుందని సమాచారం.

ప్యాక్ 2: బేసిక్ కనెక్షన్ + టీవీ సర్వీస్

ఇక రెండో ప్లాన్ కింద బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు సెటప్ బాక్స్ ద్వారా గిగా టీవీ సేవలు కూడా అందించనుంది. గిగా టీవీ ఐపీటీవీ సేవలపై ఆధారపడి ఉంటుంది. అంటే టీవీ ప్రసారాలు ఇంటర్నెట్ ద్వారా వస్తాయి.ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ ప్లాన్ ధర రూ.600 ఉండే అవకాశం ఉంది.

ప్యాక్ 3: బేసిక్ కనెక్షన్ + టీవీ సర్వీస్ + ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)

మూడో ప్లాన్ ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ. 1000 వరకు ఉంటుందని సమాచారం. ఈ మూడో ప్లాన్ కింద జియో సంస్థ గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, గిగా టీవీ సేవలతో పాటు స్మార్ట్ అప్లయెన్సెన్స్‌ను కంట్రోల్ చేయగల ఐఓటీ కంట్రోలర్ డివైస్‌ కూడా ఉంటుంది. అంటే స్మార్ట్ బల్బులు, స్మార్ట్ టీవీలను ఇతర స్మార్ట్ అప్లయన్సెస్‌ను కంట్రోల్ చేసేయొచ్చు. ఈ మూడు ప్లాన్లకు కాంప్లిమెంటరీగా ఒక జియో ఉచిత ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వనున్నారు. మరో వైపు ఈ ప్లాన్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. అయితే సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమాచారం మాత్రమే ఇది. ఎంతైనా నిప్పులేనిదే పొగరాదుగా.

English summary
Jio is expected to announce three new plans for its GigaFiber broadband service. The basic connection is expected to offer a 100Mbps connection along with complimentary landline connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X