వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరియాణాలో జాట్ల దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ ఔట్, ముత్తాత పేరు లక్కీ, జైలు దెబ్బ !

|
Google Oneindia TeluguNews

చండీగడ్/న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు దుశ్యంత్ చౌటాలా, హరియాణాలో మళ్లీ జాట్లను ఏకం చేసి ఆ రాష్ట్రంలో తన సత్తాచాటిన దుశ్యంత్ చౌటాలాను సీఎం కుర్చీ మీద కుర్చో పెట్టడానికి కాంగ్రెస్ వెనకడుగు వెయ్యడం లేదు. అయితే హరియాణాలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని స్వతంత్ర పార్టీ అభ్యర్థులతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. ముత్తాత పేరుతో పార్టీ పెట్టి హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కు దుశ్యంత్ చౌటాలా సినిమా చూపించారు. 2014లో అధికారం దూరం కావడంతో 2019 ఎన్నికల్లో జూట్లు ఏకం కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. కింగ్ మేకర్ అయిన దుశ్యంత్ చౌటాలా మాత్రం జేజేపీ పార్టీ ఇంత వరకూ బీజేపీతో కాని, కాంగ్రెస్ తో కాని సంప్రదించలేదని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథాచిత్రమ్, పెళ్లి పేరుతో శారీరకంగా, ప్రేమకుమారి కేసు ఏంది ?!బీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథాచిత్రమ్, పెళ్లి పేరుతో శారీరకంగా, ప్రేమకుమారి కేసు ఏంది ?!

26 ఏళ్లలో జాతీయ పార్టీలకు సినిమా

26 ఏళ్లలో జాతీయ పార్టీలకు సినిమా

దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న దుశ్యంత్ చౌటాలాకు ఓ ప్రత్యేక ఉంది. ఆయన వయసు చాలా తక్కువే. 2014 లోక్ సభ ఎన్నికల్లో హిసార్ లోక్ సభ నియోజక వర్గం నుంచి దుశ్యంత్ చౌటాలా ఐఎన్ఎల్ డీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటికి దుశ్యంత్ చౌటాలా వయసు 26 ఏళ్లు.

 జైల్లో మాజీ సీఎం ఫ్యామిలీ

జైల్లో మాజీ సీఎం ఫ్యామిలీ

ఉద్యోగాల కుంభకోణం కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌటాలాతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌటాలాకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. జూట్ల వర్గం మీద పగతో కొన్ని పార్టీలు ఓంప్రకాష్ చౌటాలా కుటుంబ సభ్యులను జైలుకు పంపించారని ఆ వర్గం వారు భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత, జూట్ల వర్గం నేత భూపిందర్ సింగ్ హూడా తదితరులు ఓంప్రకాష్ చౌటాలా జైలుకు వెళ్లడానికి తాము కారణం కాదని ఆ సమయంలో చెప్పారు.

చౌటాలా ఫ్యామిలీ బహిష్కరణ

చౌటాలా ఫ్యామిలీ బహిష్కరణ

ఓంప్రకాష్ చౌటాలా, ఆయన కుమారుడు అజయ్ చౌటాలా జైలుకు వెళ్లడంతో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డీ) పార్టీలో ఆదిపత్య పోరు మొదలైయ్యింది. అజయ్ చౌటాలా కుమారుడు దుశ్యంత చౌటాలా, వారి సోదరుడు దిగ్విజయ్, బాబాయ్ అభయ్ సింగ్ చౌటాలాలు ఐఎన్ఎల్ డీ పార్టీలో ఆధిపత్యం కోసం పోరాడారు. అయితే ఓంప్రకాష్ చౌటాలా ఫ్యామిలీ మీద ఆధిపత్యం సంపాధించుకున్న ఐఎన్ఎల్ డీ నాయకులు దుశ్యంత్ సోదరులను పార్టీ నుంచి బహిష్కరించారు.

చౌటాలా ప్యామిలీలో ఆధిపత్య పోరు

చౌటాలా ప్యామిలీలో ఆధిపత్య పోరు

హరియాణా రాజకీయాల్లో భారత మాజీ ఉప ప్రధాని, దివంగత చౌదరి దేవీలాల్ కు మంచి పట్టు ఉంది. 1996లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీని చౌదరి దేవీలాల్ స్థాపించారు. చౌదరి దేవిలాల్ తరువాత ఆయన పెద్ద కుమారుడు ఓంప్రకాష్ చౌటాలా ఐఎన్ఎల్ డీ పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఓం ప్రకాష్ చౌటాలా జైలుకు వెళ్లిన తరువాత ఆయన కుమారుల మధ్య ఆధిపత్య పోరు మొదలైయ్యింది.

 ముత్తాత పేరుతో పార్టీ

ముత్తాత పేరుతో పార్టీ

చిలికిచిలికి గానాగా మారడంతో ఐఎన్ఎల్ డీ పార్టీ నుంచి దుశ్యంత్ చౌటాలా సోదరులను బహిష్కరించారు. తక్కువ వయసులో రాజకీయాల్లోకి వచ్చిన దుశ్యంత్ ఉడుకు రక్తంతో రగిలిపోయారు. దుశ్యంత్ చౌటాలా ముత్తత చౌదరి దేవిలాల్ ను హరియాణాలో జననాయక్ అనే పేరుతో పిలుస్తారు. మా కుటుంబ సభ్యులను జైలుకు పంపించి మా ఫ్యామిలీ పెట్టిన పార్టీని దూరం చేస్తారా అంటూ దుశ్యంత్ రగిలిపోయారు. 2018లో ముత్తాత పేరు జననాయక పేరుతోనే దుశ్యంత్ చౌటాలా జననాయక జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు.

జూట్ల దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ జూట్

జూట్ల దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ జూట్

హరియానాలో జూట్ల కులం ప్రభావం చాల ఎక్కువగా ఉంది. ఓం ప్రకాష్ చౌటాలాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హూడా సైతం అదే కులానికి చెందిన వారే. 2014 శాసన సభ ఎన్నికల్లో జూట్ల ఓట్లు చీలిపోయాయి. జూట్ల ఓట్లు చీలిపోవడంతో 2014లో హరియాణాలో జూటేతర ముఖ్యమంత్రి కుర్చీలో మనోహర్ ఖట్టర్ కుర్చున్నారు. అయితే 2019లో జూట్లను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దుశ్యంత్ చౌటాలా తన సత్తా చాటుకున్నారు.

English summary
Haryana Assembly Election Results 2019: Reiterating that the JJP has not been approached by either BJP or Congress, Dushyant Chautala said, I am not in touch with anyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X