వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉగ్ర ఘాతుకం: కాల్పుల్లో ఇన్స్పెక్టర్ మృతి, మరోచోట ఉగ్రవాది హతం..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ ఇన్ స్పెక్టర్ వీరమరణం పొందారు. మరో చోట జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు.
అనంత్ నాగ్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అయితే పోలీసులను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. తీవ్రవాదులు ఫైర్ స్టార్ట్ చేయగా.. మహమ్మద్ అష్రఫ్ అనే ఇన్ స్పెక్టర్ చనిపోయాడు. ఇటు మరోవైపు షోపియాన్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.

షోపియాన్ జిల్లా మెల్హొరాలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని పోలీసులు భావించారు. అయితే కాల్పుల్లో ఒకరు చనిపోయారని తెలిసింది.