వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌తో లింకులు, నిధుల సేకరణ: జేఎంఐ విద్యార్థి మొహ్సిన్ అరెస్ట్, ఎన్ఐఏ రిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విద్యార్థి మొహ్సిన్ అహ్మద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం ఆగస్టు 16 వరకు రిమాండ్‌కు పంపింది. అంతకుముందు అతడ్ని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

"రాడికలైజ్డ్" వ్యక్తులు గ్లోబల్ టెర్రర్ సంస్థ కోసం డబ్బు సేకరిస్తున్నారని
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడిని ఫెడరల్ యాంటీ-టెర్రర్ ఏజెన్సీ అరెస్టు చేసిందని అధికారులు శనివారం చెప్పారు.

JMI Student Mohsin Ahmed Arrested For IS Link: NIA Remand Till Aug 16

వాస్తవానికి పాట్నాకు చెందిన అహ్మద్‌ను ఢిల్లీలోని బాట్లా హౌస్‌లోని అతని నివాసం నుంచి సెర్చ్ పార్టీ అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

అహ్మద్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడు. అతను భారతదేశం, విదేశాలలో సానుభూతిపరుల నుంచి ISIS కోసం నిధుల సేకరణలో పాల్గొన్నందుకు అరెస్టు చేయబడ్డాడు. అతను ఈ నిధులను సిరియా, ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడని ప్రతినిధి తెలిపారు. ISIS కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు క్రిప్టోకరెన్సీ రూపంలో ఈ నిధులను పంపుతున్నాడి పేర్కొన్నారు.

Recommended Video

Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia

మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రైసెన్, గుజరాత్‌లోని భరూచ్, సూరత్, నవ్‌సారి, అహ్మదాబాద్, బీహార్‌లోని అరారియా, కర్ణాటకలోని భత్కల్, తుంకూర్ సిటీ, కొల్హాపూర్, మహారాష్ట్రలోని నాందేడ్, ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్ సహా.. ఆరు రాష్ట్రాల్లోని అనుమానిత వ్యక్తుల 13 స్థలాలలో ఫెడరల్ ఏజెన్సీ జూలై 31న సోదాలు నిర్వహించింది.

English summary
JMI Student Mohsin Ahmed Arrested For 'IS Link': NIA Remand Till Aug 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X