వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JNU Violence:నిర్మలా సీతారామన్ నుంచి సీతారం ఏచూరి వరకు..పూర్వ విద్యార్థుల స్పందన

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఏన్‌యూ)లో ఆదివారం హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముసుగు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లో హింసకు పాల్పడిన ఘఘటనపై జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు స్పందించారు. ఇలా స్పందించిన వారిలో ఇద్దరు సీనియర్ కేబినెట్ మంత్రులు ఉన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింసను తాము ఖండిస్తున్నట్లు ఈ క్యాంపస్ పూర్వ విద్యార్థులు ప్రస్తుత విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హింస ఎవరు చేసినా ప్రోత్సహించేదిలేదని చెప్పారు.

JNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపుJNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపు

విద్యార్థులకు క్యాంపస్‌లు సురక్షితంగా నిలవాలి

ఆదివారం జరిగిన హింసకు సంబంధించిన ఫోటోలు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పారు నిర్మలా సీతారామన్. గత కొద్ది రోజులుగా క్యాంపస్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి.విద్యార్థులకు యూనివర్శిటీ క్యాంపస్‌లు సురక్షితంగా ఉండాలని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే క్యాంపస్‌లో హింసకు పాల్పడింది లెఫ్ట్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం అని ఏబీవీపీ ఆరోపించగా... ఆ హింసకు ముఖ్య కారణం ఏబీవీపీ అని లెఫ్ట్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా అందరిని చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.

నియంత్రించేలా పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలి

ఇదిలా ఉంటే జే‌ఎన్‌యూ పూర్వ విద్యార్థి , నటి స్వరభాస్కర్ కూడా స్పందించింది. యూనివర్శిటీ ప్రధాన గేట్ దగ్గర ప్రజలు సమావేశమై క్యాంపస్‌లో జరుగుతున్న అల్లర్లను నియంత్రించేలా ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఢిల్లీ పోలీసులు హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని స్వరభాస్కర్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తల్లిదండ్రులు క్యాంపస్‌లోనే ఉంటారని ఇది తనకు చాలా వ్యక్తిగతమైన అంశమని స్వరభాస్కర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జేఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన నేపాల్ మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారీ స్వరభాస్కర్ ట్వీట్‌ను రీపోస్టు చేస్తూ ఆదివారం క్యాంపస్‌లో జరిగిన హింసాత్మక ఘటన తనను కలచివేసిందని పవిత్రమైన విద్యాలయంను కాపాడండి అంటూ పోస్టు చేశారు.

విద్యార్థులు తలొగ్గే పరిస్థితి లేదు: కన్హయ కుమార్

మరోవైపు ప్రభుత్వం తమ నోళ్లను మూయించేందుకు ఎంత ప్రయత్నించినా... విద్యార్థులు తలొగ్గే పరిస్థితే లేదని హెచ్చరించారు జేఎన్‌యూ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు కన్హయ కుమార్. జేఎన్‌యూ విద్యార్థి సంఘాల మాజీ ఉపాధ్యక్షుడు షెహ్లా రషీద్ స్పందించారు. ఇటు భారత్‌లో అటు విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ కష్టకాలంలో జేఎన్‌యూ విద్యార్థులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఇక జేఎన్‌యూ స్ఫూర్తిని కొందరు పిరికివారు విచ్ఛిన్నం చేయలేరని మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ అన్నారు.

క్యాంపస్‌లో హిందూత్వ అజెండా కోసం ప్రయత్నం


పక్క వ్యూహంతోనే జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసకు పాల్పడ్డారని దీని వెనక అధికారిక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు మరో పూర్వ విద్యార్థి సీపీఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి. జేఎన్‌యూకు హిందూత్వ అజెండాను రుద్దాలని కొందరు ప్రయత్నిస్తున్నారని దీన్ని తిప్పికొడతామని సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో నెలకొన్న హింసను ఖండించింది బీజేపీ. క్యాంపస్‌లో కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని ఇందుకోసం విద్యార్థులను పావులుగా వాడుతున్నారని ఆరోపించింది.

English summary
Several alumni of Delhi's Jawaharlal Nehru University have spoken out against the violence unleashed on its campus by masked, armed assailants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X