వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ క్యాంపస్‌లో కండోమ్‌లు..అమ్మాయిలు వాటితో ఏం చేస్తారో తెలుసా:మాజీ డీజీపీ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కేరళ: ఆ యూనివర్శిటీ నిండా కండోమ్‌లే. క్యాంపస్‌లో ఎటుచూసినా కండోమ్‌లే దర్శనమిస్తాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు కేరళ మాజీ డీజీపీ, బీజేపీ సానుభూతిపరుడైన టీపీ సేన్ కుమార్. ఎప్పుడో పాత వివాదానికి తాజాగా ఆజ్యం పోశారు టీపీ సేన్‌కుమార్. 40 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్లీ అగ్గిరాజేశారు. ఇంతకీ ఆ యూనివర్శిటీ ఏమిటి.. 40 ఏళ్ల క్రితం ఆయన ఏం చూశారు.

 ఎటు చూసినా కండోమ్‌లేనట

ఎటు చూసినా కండోమ్‌లేనట

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్శిటీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ. హాస్టల్ ఫీజుల పెంపుపై ప్రస్తుతం క్యాంపస్ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకిపోతోంది. ఈ క్రమంలోనే కేరళకు చెందిన మాజీ డీజీపీ బీజేపీ సానుభూతిపరుడైన టీపీ సేన్‌ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు క్యాంపస్ అట్టుడుకుతుంటే మరోవైపు కండోమ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అగ్గిరాజేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఎటు చూసినా కండోమ్‌లే దర్శనమిస్తాయని సేన్ కుమార్ కాంట్రవర్శీ స్టేట్‌మెంట్ చేశారు.

 అబ్బాయిల హాస్టల్స్‌లో అమ్మాయిలు ఉండేవారు

అబ్బాయిల హాస్టల్స్‌లో అమ్మాయిలు ఉండేవారు

అబ్బాయిలు ఉండే హాస్టల్‌లోని టాయ్‌లెట్స్ నుంచి అమ్మాయిలు బయటకు రావడం తాను చూసినట్లు చెప్పిన సేన్ కుమార్.. అయితే అది 40 ఏళ్ల క్రితం మాటగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కండోమ్‌లతో అమ్మాయిలు తమ జుట్టును కట్టుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాంపస్ నిండా కండోమ్‌లు ఉండే యూనివర్శిటీ వద్దని చెప్పారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యంపై కేరళ సెంట్రల్ యూనివర్శిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో సేన్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూలో హాస్టల్ ఫీజు పెంపుపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోలను పోస్టు చేస్తుండటం వాటినే తీసుకుని సేన్‌కుమార్ ఉదహరించారని తెలుస్తోంది.

 సర్క్యులేట్ అవుతున్న ఫేక్ ఫోటోలు

సర్క్యులేట్ అవుతున్న ఫేక్ ఫోటోలు

జేఎన్‌యూలో విద్యార్థులు ఆందోళనకు దిగినప్పటి నుంచి కొన్ని తప్పుడు అసత్య ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఓ అమ్మాయి కండోమ్‌తో తన జుట్టును కట్టుకుంటూ ఉండే ఫోటో బాగా సర్క్యులేట్ అయ్యింది. ఆ ఫోటో గురించి సేన్‌కుమార్ ప్రస్తావించి వివాదానికి తెరలేపారు. మరో ఫోటోలో ఓ యువతి మద్యం బాటిల్‌ను పట్టుకుని ఉన్నట్లుగా ఉన్న ఫోటోను సర్క్యులేట్ చేశారు.అయితే రెండు ఫోటోలు ఫేక్ ఫోటోలని పలు వెబ్‌సైట్లు నిర్థారించాయి కూడా.

 వాడిపడేసిన కండోమ్‌లు, అబార్షన్ ఇంజెక్షన్లు

వాడిపడేసిన కండోమ్‌లు, అబార్షన్ ఇంజెక్షన్లు

జేఎన్‌యూ పేరు ప్రఖ్యాతులను మంటగలిపేందుకు కొందరు కావాలనే పనిగట్టుకుని ఫేక్ ఫోటోలను సర్క్యులేట్ చేయడం ఇదితొలిసారి కాదు. 2016లో కూడా రాజస్థాన్‌కు చెందిన రామగడ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్‌దేవ్ అహుజా కూడా కొన్ని వివాదాస్నద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూలో ప్రతిరోజు 3వేల బీరు బాటిళ్లు మరియు క్యాన్లు, 2వేలు దేశీ లిక్కర్ బాటిళ్లు, 10వేల సిగరెట్ పీకలు, 4వేల బీడీలు, 50వేల ఎముకలు, 2వేల చిప్స్ ఖాళీ ప్యాకెట్లు, వాడి పడేసిన 3వేల కండోమ్‌లు, 5వేల అబార్షన్ ఇంజెక్షన్లు కనిపిస్తాయనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై క్యాంపస్ ఒక్కసారిగా భగ్గుమంది.

English summary
Former Kerala DGP and BJP sympathiser T.P. Senkumar has reignited an old controversy as he said Jawaharlal Nehru University (JNU) was littered with condoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X