వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7లో 2 కన్నయ్య మాట్లాడినవి కావు: బెయిలొచ్చింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమానికి సంబంధించిన వీడియోల్లో రెండు కల్పిత వీడియోలున్నాయని ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలింది. వీడియోలో లేని వ్యక్తుల మాటలను వాటిలో చొప్పించారని నివేదిక స్పష్టంచేసింది.

జేఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాల ఘటనకు సంబంధించి మొత్తం ఏడు వీడియో క్లిప్పింగులను పరీక్షించాల్సిందిగా హైదరాబాద్‌లోని 'ట్రూత్‌ ల్యాబ్స్‌'ను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. వాటిలో ఐదు మాత్రమే వాస్తవమైనవని పేర్కొంటూ.. తాజాగా తమ నివేదికను 'ట్రూత్‌ ల్యాబ్స్‌' సమర్పించింది.

JNU: Forensic lab finds Kanhaiya videos doctored

బుధవారం ట్రూత్ ల్యాబ్ చీఫ్ గాంధీ మాట్లాడుతూ.. జేఎన్‌యూ ఆడియో, వీడియో టేపులను పరిశీలించామని తెలిపారు. కొన్ని చోట్ల కన్నయ్య మాటలను జోడించారని, మరికొన్ని చోట్ల వీడియో తొలగించారని చెప్పారు. కన్నయ్య మాట్లాడినట్లు వచ్చిన వ్యాఖ్యలు అతనివి కావని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం పంపిన 7 టేపుల్లో రెండు నకిలీవని తేల్చినట్లు తెలిపారు.

కాగా, మరోవైపు, దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలకు మంగళవారం ఢిల్లీ స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇది ఇలా ఉండగా, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కన్నయ్య కుమార్‌కు బెయిల్

కన్నయ్య కుమార్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అతనికి ఆరు నెలల పాటు బెయిల్ ఇచ్చింది. రెండు వారాలుగా కన్నయ్య కుమార్ జైలులో ఉంటున్నాడు. రూ.10వేలు, జెఎన్‌యూ ప్రొఫెసర్ పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. అతను రేపు విడుదలయ్యే అవకాశముంది.

English summary
At least two out of the seven video clips of the alleged 'anti-national' sloganeering in Jawaharlal Nehru University (JNU) on February 9 and 11 have been 'doctored,' according to forensic reports accessed by various media outlets on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X