వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెంచిన హాస్టల్ ఫీజు ఇతర ఛార్జీలు 50శాతంకు తగ్గించాలని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన అంతర్గత హైలెవెల్ కమిటీ పాలనా విభాగానికి సూచించింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు 75శాతం ఫీజును తగ్గిస్తూ పాలనావిభాగానికి హైలెవెల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ రికమెండేషన్స్‌ను జేఎన్‌యూ పాలనావిభాగంకు నివేదిక రూపంలో హైలెవెల్ కమిటీ అందించగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దీనికి ఆమోద ముద్ర వేశారు. అంతేకాదు సర్క్యులేషన్ ద్వారా అందరికీ తెలిపారు. జనవరి 2020 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని సమాచారం.

JNU protests:త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం, నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులుJNU protests:త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం, నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు

ఇదిలా ఉంటే జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు మాత్రం ఫీజులను మొత్తంగా తీసేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ ఫీజు భారం అవుతుందని చెబుతున్నాయి. ఇక దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75శాతం ఫీజు తగ్గించడం అదే సమయంలో ఇతరులకు 50శాతం ఫీజు తగ్గించడం మంచి నిర్ణయం అని ఇది విద్యార్థులకు మేలు చేసే నిర్ణయమే అవుతుందని హైలెవల్ కమిటీ అభిప్రాయపడింది.

JNU strike:High level committee recommends 50% rollback of fees,25% extra to BPL students

విద్యార్థుల ఆందోళనలకు దిగడంతో ఆ ప్రభావం చదువుపై పడిందని హైలెవల్ కమిటీ పేర్కొంది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారని వెల్లడించింది. ఇక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నందున విద్యార్థులు ఇప్పటికైనా ఆందోళన విరమించాలని జేఎన్‌యూ మేనేజ్‌మెంట్ కోరింది. ఆందోళనలతో ఇతర విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మేనేజ్‌మెంట్ కోరింది.

ఇదిలా ఉంటే ఫీజును 50శాతం తగ్గించడమనేది మంచి నిర్ణయం అని చెబుతూ యూనివర్శిటీ విద్యార్థులందరికీ యూటిలిటీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలను రద్దు చేయాలని హైలెవల్ కమిటీ సూచించినట్లు తన సర్క్యులర్‌లో పేర్కొంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. యూటిలిటీ, సర్వీస్ ఛార్జీలను నెలకు రూ. 2వేలు అంచనా వేయగా, దాన్ని 50శాతానికి తగ్గిస్తూ నెలకు రూ.1000గా చేయాలని సూచించింది. ఇది విద్యార్థులందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఫీజులో యూటిలిటీ ఛార్జీలు, సర్వీసు ఛార్జీలను 75శాతం తగ్గించాలని హైలెవల్ కమిటీ సూచించింది. నెలకు రూ.2000 అంచనా వేయగా ఇప్పుడు కొత్త సూచనలతో ఆ విద్యార్థులు నెలకు రూ. 500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

English summary
The internal high-level committee (HLC) set up by the Jawaharlal Nehru University has recommended a 50 per cent reduction of hostel fees and utility charges for students from the level it had decided earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X