వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ ఎస్కేప్ : జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై హత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థినేత ఉమర్ ఖలీద్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల నుంచి ఖలీద్ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కాన్స్‌టిట్యూషన్ క్లబ్ బయట చోటుచేసుకుంది. 'కాఫ్ సే ఆజాదీ' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌కు వచ్చాడు. ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ అగినెయిస్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఖాలిద్ తన ఇతర మిత్రులతో కలిసి ఓ చెట్టుకింద ఉన్న టీస్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో ఓ దుండగుడు ఖలీద్‌ను కిందకు తోసేసి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడని చెప్పారు. కాల్పులు జరిపినప్పుడు ఖలిద్ కిందకు పడిపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆ దుండగుడు పారిపోయాడు. ఈ ఘటన తర్వాత ఖాలిద్ మాట్లాడాడు. దేశంలో భయానకవాతావరణం కనిపిస్తోందని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

JNU student leader Umar Khalid shot, escapes unhurt

ఫిబ్రవరి 9, 2016న జవహర్‌లాల్ యూనివర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు చేశారని పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఖలీద్ కూడా ఒకరిగా ఉన్నాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లోని విద్యార్థులు రోడ్లపైకొచ్చి తమ నిరసనలు తెలిపారు. ఇదిలా ఉంటే జాతివ్యతిరేక నినాదాలు చేశాడని పలు సెక్షన్ల కింద ఖలీద్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యూనివర్శిటీ కూడా అతన్ని సస్పెండ్ చేసింది.

English summary
JNU student leader Umar Khalid escaped unhurt after an unidentified man shot at him in central Delhi on Monday.The incident took place outside the Constitution Club in the heart of the city where he had come for an event titled ‘Khauff Se Azaadi’, organised by an organisation named ‘United Against Hate’. The assailant fled as Khalid’s associates tried to apprehend him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X