వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ భగ్గుమన్న జేఎన్‌యూ: ఫీజు తగ్గించాలంటూ స్టూడెంట్స్ నిరసనలు.. బంద్‌కు పిలుపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, విద్యార్థుల నిరసనలతో మళ్లీ భగ్గుమంది. విద్యార్థులు హాస్టల్ మాన్యువల్‌లో ఫీజుల పెంపు, డ్రెస్‌కోడ్‌లాంటి అంశాలు చేర్చడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా ఏకమై నిరసనలు తెలిపారు. దీంతో నిరసనలు వెంటనే ఆపాలని, ఆ ప్రభావం అకడమిక్స్ పై పడుతోందంటూ పాలనావర్గం విద్యార్థులను కోరింది.

చాలా కాలం తర్వాత భగ్గుమన్న జేఎన్‌యూ

చాలా కాలం తర్వాత భగ్గుమన్న జేఎన్‌యూ

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ మరోసారి భగ్గుమంది. గతకొద్ది కాలంగా క్యాంపస్‌లో ప్రశాతం వాతావరణం నెలకొనగా... మళ్లీ విద్యార్థులు యూనివర్శిటీ పాలనా వర్గంపై కన్నెర్ర చేశారు. విద్యార్థుల ఫీజులు, డ్రెస్ కోడ్‌లపై కొత్త నిబంధనలు తీసుకురావడంతో స్టూడెంట్స్ నిరసనకు దిగారు. రోజురోజుకూ ఉద్రిక్తత పెరుగుతుండటంతో ఆయా చోట్ల పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

యూనివర్శిటీ బంద్‌కు పిలుపు

యూనివర్శిటీ బంద్‌కు పిలుపు

ఇదిలా ఉంటే డ్రాఫ్ట్ మాన్యువల్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల యూనియన్ సోమవారం రోజున యూనివర్శిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు విద్యార్థులు వెంటనే నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు క్యాంపస్‌లో చదువుకునేందుకు వచ్చారని వారి జీవితాలతో ఆడుకునే హక్కు ఎవ్వరికీ లేదని పాలనా యంత్రాంగం చెబుతోంది. స్ట్రైక్ వల్ల విద్యార్థులు తరగతులకు వెళ్లలేకు ఉన్నారని పాలనాయంత్రాంగం చెబుతోంది.

 విద్యార్థుల యూనియన్ తీరు సరిగ్గా లేదన్న జేఎన్‌యూ

విద్యార్థుల యూనియన్ తీరు సరిగ్గా లేదన్న జేఎన్‌యూ

ఇదిలా ఉంటే హాస్టల్ కమిటీలతో చర్చలు జరుపుతామని చెబుతున్నప్పటికీ విద్యార్థి యూనియన్లు చర్చలకు అడ్డుపడుతున్నారని పాలనాయంత్రాంగం వాపోయింది. ఇక బుద్ధిగా చదువుకునే విద్యార్థులను కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ విద్యార్థుల యూనియన్ బలవంతం చేస్తోందని ఆరోపించింది. ఇక విద్యార్థి యూనియన్ క్యాంపస్‌లో రాద్దాంతం సృష్టిస్తోందని మండిపడింది పాలనాయంత్రాంగం. అంతేకాదు విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 ఫీజు పెంపు ఇతర అంశాలపై నిరసన

ఫీజు పెంపు ఇతర అంశాలపై నిరసన

గత 15 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పాలనాయంత్రాంగం మాత్రం దిగిరావడం లేదని విద్యార్థి యూనియన్‌లోని ఒక సభ్యుడు చెప్పాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారని అందులో చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని చెప్పిన వ్యక్తి... ఫీజులను పెంచడం ఇతర అంశాలపై పరిధిలు విధించడం సబబు కాదని చెప్పాడు. ఇక నిరసనల్లో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ఫ్ల కార్డులను ప్రదర్శించారు.

English summary
The JNU students' union has been on a strike against a draft hostel manual approved by the Inter-Hall administration, saying the manual has provisions for the fee hike, dress code and curfew timings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X