• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాఫ్ట్‌వేర్ సంక్షోభం: జ్యోతిష్యుల వైపు టెక్కీల పరుగులు

By Narsimha
|

బెంగుళూరు:సాఫ్ట్‌వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగభద్రత కోసం టెక్కీలు జ్యోతిష్యులు, న్యూమారాలజిస్టులను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు వారు తమ ఉద్యోగాల్లో భద్రత విషయమై ఆరాతీస్తున్నారు. ఉద్యోగం కోల్పోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిష్కారమార్గాలను తెలుసుకొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో ఉంది. అయితే ఈ కారణాల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉద్యోగ భద్రత కరువైంది.

ఇండియాలోని చాలా కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే టెక్కీలకు పింక్ స్లిప్పులను అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి.అయితే ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు ప్రధానంగా ఇండియా ఐటీ పరిశ్రమలపై తీవ్రంగా కన్పిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తోందోననే భయంతో టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. దరిమిలా తమ ఉద్యోగ భద్రత విషయమై జ్యోతిష్యులను, సంఖ్యశాస్త్ర నిపుణులను ఆశ్రయిస్తున్నారు.

జ్యోతిష్యుల ఇంటికి బారులు తీరుతున్న టెక్కీలు

జ్యోతిష్యుల ఇంటికి బారులు తీరుతున్న టెక్కీలు

సంక్షోభంలో ఉన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమతో టెక్కీలు భయాందోళనల్లో ఉన్నారు. ఉద్యోగభద్రత లేదనే ఆందోళన వారిలో వ్యక్తమౌతోంది. దీంతో వారంతా జ్యోతిష్యులు,న్యూమారాలజిస్టుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎప్పుడు పింక్ స్లిప్పులు వస్తాయోననే భయం నెలకొన్న నేపథ్యంలో పరిహరాలు, ప్రత్యామ్నాయమార్గాల కోసం టెక్కీలు తాపత్రయపడుతున్నారు. దరిమలా జ్యోతిష్యులు, సంఖ్యశాస్త్ర నిపుణుల వద్దకు వెళ్తున్నారు.

  IT Boom Has Been Reduced Future Jobs in These Sectors - Oneindia Telugu
  95 శాతం జ్యోతిష్యుల వద్దకు టెక్కీలే

  95 శాతం జ్యోతిష్యుల వద్దకు టెక్కీలే

  తమ భవిష్యత్‌ను తెలుసుకొనేందుకు టెక్కీలు జ్యోతిష్యుల వద్దకు వెళ్థున్నారు. బెంగుళూరులోని షీలా బజాజ్ డైరీ ప్రముఖ న్యూమరాలజిస్ట్. ఆమె వద్దకు వచ్చేవారిలో 95 శాతం టెక్కీలే ఉన్నారు. పరిహరం కోసమో, పేరు మార్పు కోసమో, ఇంకా ఇతరత్రా సూచనలు, సలహల కోసం షీలా బజాజ్ వద్దకు టెక్కీలు వెళ్తున్నారు.

   టెక్కీలు అడిగే ప్రశ్నలివే

  టెక్కీలు అడిగే ప్రశ్నలివే

  లే ఆఫ్ ప్రమాదం ఉందా... లే ఆఫ్ ప్రమాదం పొంచి ఉంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి...పరిహరాలున్నాయా, ప్రత్యామ్నాయాలున్నాయా అనే అంశాలపై టెక్కీలు న్యూమరాలజిస్టును ప్రశ్నిస్తున్నారని సమాచారం. దీని నుండి బయటపడేందుకు తక్షణమే ఉన్న అధ్యాత్మిక మార్గాలు ఏమిటనే విషయాలపై కూడ వారు ఆరాతీస్తున్నారు.

   35-45 ఏళ్ళ వయస్సు వారే ఎక్కువ

  35-45 ఏళ్ళ వయస్సు వారే ఎక్కువ

  జ్యోతిష్యులను, సంఖ్యశాస్త్ర నిపుణుల సంప్రదించే వారిలో ఎక్కువ మంది 35-45 ఏళ్ళ వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని తేలింది. వీరంతా కూడ తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనతో ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ ఫీజును చెల్లించేందుకు కూడ టెక్కీలు వెనుకడుగు వేయడం లేదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Numerologist Sheelaa Bajaj's diary is suddenly jampacked. Many techies are visiting her at her consultation studio in Koramangala. The spate of layoffs has sent a chill through India's Silicon Valley, where the software industry employs about 1.2 million techies. Many software professionals on the bench and those staring at an uncertain future are seeking astrological consultation
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more