వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం లేదని కొడుకులను చంపిన తండ్రి: ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

Jobless 40-yr-old kills two sons, commits suicide
మొహాలీ: ఓ నిరుద్యోగ తండ్రి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లాలోని లాండ్రన్ గ్రామంలో చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణం తీవ్రమైన పేదరికమేనని అతడు సూసైడ్ నోట్‌ రాసిపెట్టాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

జగ్తర్ సింగ్, అతని కుమారులు గౌరవ్‌దీప్ సింగ్ (13), హర్షదీప్ సింగ్ (12) ఒకే గదిలో మృతదేహాలుగా పడివున్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. జగ్తర్ సింగ్ కుమారులిద్దరూ మొహాలీలోని దేవ్ పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. కాగా శనివారం రాత్రి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చిన తండ్రి జాగ్తర్, వారిని గొంతుకు పిసికి హత్య చేశాడు. తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనకు ముందే జగ్తర్ తన భార్య ఛరణ్‌జీత్ కౌర్‌ను తన తల్లిగారింటికి పంపించేశాడు. కాగా జగ్తర్ సింగ్ తల్లి గురుదేవ్ కౌర్ (80) టీ చేసేందుకు మొదటి అంతస్తులో నుంచి కిందికి వచ్చింది. ఆ గదిలో ముగ్గురు మృతి చెంది ఉండటంతో చూసిన కౌర్ కేకలు వేయడంతో ఇతర కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జగ్తర్ సింగ్‌కు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని స్థానికులు చెబుతున్నారు.

జగ్తర్ తన తొంటి ఆపరేషన్ కోసం ఇప్పటికే అప్పులు చేశాడని, ఉద్యోగం కూడా లేకపోవడంతో అప్పుల బాధ, పేదరికం తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అంటున్నారు. తొంటి నొప్పి కారణంగా తన భార్యతో కూడా జగ్తర్ సింగ్ పలుమార్లు గొడవపడ్డట్లు చెబుతున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మొహాలీలోని ఆస్పత్రికి తరలించారు.

English summary

 A 40-year-old unemployed man allegedly killed his two sons before committing suicide at Landran village near Sohana in Mohali district on Saturday night, blaming poverty for his extreme step in a note he left behind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X