వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చెక్... వేతనాల్లో భారీ మార్పులకు కంపెనీలు సిద్ధం

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడుతుండటంతో పై స్థాయి లేదా ఉన్నత ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో దానికి అనుగుణంగానే నియామకాలు ఆయా సంస్థలు చేపడుతున్నాయి. సీ క్లాస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అయితే తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేసే వారికోసం సంస్థలు వేటాడుతున్నాయని హెడ్‌హంటర్స్ అనే సంస్థ వెల్లడించింది.

 భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.? భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ల నియామకాలు దాదాపు 10శాతం తగ్గిపోయాయని, వారి జీతభత్యాల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలున్నాయని హెడ్ హంటర్స్ సంస్థ పేర్కొంది.సీఈఓలను కూడా సంస్థలు తాము అనుకున్న వేతనాల పరిధిలో ఉంటేనే వ్యక్తులను నియమించుకుంటున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ సంస్థలో మేనేజర్ కింద డిప్యూటీలు ఉంటే ఒకే పనికి అంతమంది ఉద్యోగస్తులు అవసరంలేదనే అభిప్రాయానికి కంపెనీ యాజమాన్యాలు వచ్చాయని, ఆ డ్యూటీలన్నీ ఒకే వ్యక్తితో చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Jobs for top posts declined due to slowdown in economy

సెప్టెంబర్ 11న విడుదలైన నౌకరీ డాట్ కామ్ ప్రకారం నాయకత్వ పాత్రను పోషించే ఉద్యోగుల అంటే లీడర్‌షిప్‌ రోల్స్‌ టేకప్ చేసేవారికి 16 ఏళ్ల అనుభవంను ఇప్పటి వరకు సంస్థలు చూసేవని ఇప్పుడు అది 8శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక జీతం కాకుండా ఇతర ఇన్సెన్‌టివ్స్‌ కూడా తగ్గించే పనిలో కంపెనీలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వారి పనితనం ఆధారంగా అంటే పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా వారి జీతాల్లో పెంపును ఇవ్వాలని కంపెనీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇలా చేయడం వల్ల సంస్థకు ఎంతో ఆదా అవుతుందనే ఒపీనియన్‌లో యాజమాన్యాలు ఉన్నట్లు సమచారం.

ఇప్పటికే ఉత్పత్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సేవా రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. సీఎఫ్‌ఓ అవసరమా అనే స్థాయికి కంపెనీ యాజమాన్యాలు వచ్చేశాయని నిపుణులు చెబుతున్నారు. అదే పనిని ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ కంట్రోలర్‌కు అప్పగించే పనిలో ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

English summary
Companies have stopped hiring employees with high salaries keeping in mind of the slowing economic growth according to a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X