వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్వార్ అత్యాచారంపై జోధ్‌పూర్ కోర్టు ప్రభుత్వానికి షాక్, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్‌లోని ఆల్వార్ అత్యాచారానికి సంఘటనపై పూర్తివివరాలు ఇవ్వాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జోధ్‌పూర్ కోర్టు. గతనెల జరిగిన యువతిపై గ్యాంగ్ రేప్ జరగింది. భర్తతో కలిసి వెళ్లిన ఓ దళిత మహిళ సాముహిక అత్యాచారానికి గురైన రాష్ట్ర్ర పోలీసులు సరిగా స్పందించలేదు. పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉన్నామని చెబుతున్న నేపథ్యంలో , ఆ సంఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం పెద్దగా స్పందించిన దాఖాలలు కనిపించలేదు.

దీంతో ఈ సమస్యపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించడంతో ఒక్కసారిగా రాష్ట్ర్రంలో సంచలనం రేపింది. దీంతో కోర్టు జోక్యం చేసుకుని ఈ సంఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గత నెల 26న టూవీలర్ పై వెళుతున్న భార్యభర్తలను అడ్డగించి ఆరుగురు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఇసుక క్వారీల్లోకి తీసుకెళ్లి, భర్తముందే 18 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ఈనేపథ్యంలోనే అత్యాచారం ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ నేరుగా ప్రస్థావించారు. రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుపలుకుతున్న మాయవతిపై ఆయన విరుకుచుకు పడ్డారు.

Jodhpur Highcourt has asked for more information on the attacks

మాయవతి దళితుల హక్కులను కాపాడడంలో ముసలి కన్నీరు కారుస్తుందని యూపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కాగా రాజస్థాన్ లో ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు మాయవతికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు ప్రధాని నరేంద్రమోడీ.

అత్యాచారానికి రాజకీయ రంగుపులుముకోవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి సైతం బాధిత కుటుంభాన్ని పరామర్మించారు. ఈనేపథ్యంలోనే ఆకుటుంభానికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
The Jodhpur High Court today issued a notice to the Rajasthan government on the recent incidents of rape in the state, including the April 26 gang-rape of a Dalit woman in Alwar district. the court has asked the Congress government in the state for more information on the attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X