• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జార్జ్ ఫ్లాయిడ్ తరహాలోనే: మెడను మోకాలితో అదిమి పెట్టి: పోలీసుల చర్యపై

|

జైపూర్: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అమెరికా అట్టుడికి పోవడానికి ప్రధాన కారణం- నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం. అతణ్ని అదుపులోకి తీసుకుంటోన్న సమయంలో ఓ పోలీసు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అతని ప్రాణాలను తీసింది. పారిపోవడానికి ప్రయత్నించిన జార్జ్ ఫ్లాయిడ్‌ను రోడ్డుపై పడేసి, తన మోకాలితో అతని మెడను అదిమి పెట్టి కూర్చున్నాడు. ఫలితంగా జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి ఆడక మరణించాడు.

రాజస్థాన్‌లో కూడా అచ్చంగా ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. ఒక్కటే తేడా- అమెరికా పోలీసుల దుశ్చర్యకు జార్జ్ ఫ్లాయిడ్ మరణించగా.. రాజస్థాన్ ఉదంతంలో అతను తప్పించుకోగలిగాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోధ్‌పూర్ పోలీసుల పనితీరును ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఉదంతంపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jodhpur Police in Rajasthan repeat of George Floyd incident

జోధ్‌పూర్‌లోని బల్‌దేవ్ నగర్‌లో పోలీసులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో ముఖేష్ కుమార్ ప్రజాపతి అనే వ్యక్తి మాస్క్ ధరించకుండా తిరుగుతుండటాన్ని గమనించారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతణ్ని అదుపులోకి తీసుకుని జరిమానా విధించడానికి సిద్ధపడ్డారు. దీనితో ముఖేష్ కుమార్ వారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను పోలీసులపై దాడి సైతం చేశాడు. అతనికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు పోలీసులు.

అతని వెంటపడి మరీ పట్టుకున్నారు. కిందపడేశారు. వారిలో ఓ పోలీసు అతను పైకి లేవకుండా.. ప్రజాపతి మెడపై తన మోకాలిని అదిమి పెట్టి ఉంచాడు. అతనిపై ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. పెనుగులాడుతోన్న అతణ్ని చితగ్గొట్టాడు. అతని ఎడమచేతిలో ఉన్న బైక్ తాళాలను లాక్కుని తన జేబులో వేసుకున్నాడా పోలీసు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సర్ది చెప్పారు. పైకి లేచిన అనంతరం ఆ వ్యక్తి పోలీసులపై దాడికి దిగాడు.

ఇద్దరు కానిస్టేబుళ్లను ఇస్టానుసారంగా కొట్టడం వీడియోలో కనిపించింది. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. స్థానికులు దీన్ని తమ మొబైల్‌లో చిత్రీకరించారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జోధ్‌పూర్ డీఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడినందుకు ముఖేష్ కుమార్ ప్రజాపతిపై కేసు నమోదు చేశారు. పోలీసుల తప్పుగా తేలితే శాఖాపరమైన చర్యలను తీసుకుంటామని అన్నారు.

English summary
A video has gone viral on social media showing what could be called Jodhpur''s George Floyd moment with a twist, showing cops throwing a person on the ground and pressing his neck with their knees for roaming around without a mask. However, unlike the unfortunate incident in Minneapolis, Minnesota, the cops in Jodhpur reportedly acted after the person, said to be mentally challenged, turned violent after being confronted by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X