వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీలోకి చేతన్ భగత్?: నెటిజన్ల సైటైర్లు, అసలు విషయం ఏంటంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ చేసిన ఓ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'కర్ణాటక ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. రాహుల్‌ గాంధీకి అండగా ఉంటా. భారత్‌ను మెరుగైన స్థితికి చేర్చేందుకు ఈ నిర్ణయం. ఇంతపెద్ద అడుగు వేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై ఆయన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. 'ఇప్పటివరకు మీ పుస్తకాలు చదివా. ఇక నుంచి అవన్నీ వదిలేస్తా.' అంటూ ఓ అభిమాని రీట్వీట్‌ చేయగా, మరో అభిమాని.. 'మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నా. మీరు కాంగ్రెస్‌లో చేరితే అన్‌ఫాలో అవుతా' అంటూ తేల్చి చెప్పేశాడు.

 Joining Congress, Tweets Chetan Bhagat. But Dont Miss The Fine Print

'డూడ్‌ నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది'.. 'మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మీలాంటి వారంతా వచ్చి అసలైన కాంగ్రెస్‌ విలువలను నిలబెట్టాలి'.. 'ఇది పప్పు దినం మనం నమ్మాల్సిందే' అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ట్వీట్లు కూడా నమ్ముతున్నారా? అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్వీట్‌ చివరిలో మరిన్ని వివరాల కోసం అంటూ చేతన్‌ ఓ లింక్‌ను జతపరిచారు. దానిని క్లిక్‌ చేస్తే ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అంటూ వికీపీడియా పేజ్‌ తెరుచుకుంటోంది. దీన్ని బట్టి ఇదంతా ఏప్రిల్‌ 1న ఫూల్స్‌డే సందర్భంగా ఆయన చేసిన సరదా ట్వీట్‌ అని అర్థమవుతోంది.

English summary
About two hours ago, in a tweet that surprised many, author Chetan Bhagat announced that he would be joining the Congress party and supporting their Karnataka campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X